హిందూ జ్యోతిష శాస్త్రంలో పంచాంగంలో ఒక అంశం కరణం. పంచాంగం అనగా తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం - ఈ ఐదు భాగముల కలయిక. పంచాంగం దుర్ముహూర్తములు, శుభముహూర్తములు తెలుపుతుంది. పంచాంగములు రెండు రకములు. చాంద్రమాన పంచాంగం (చంద్రుని సంచరణతో అనుసంధానమైనది), సూర్యమాన పంచాంగం (సూర్యుని సంచరణతో అనుసంధానమైనది).

జీవితంపై పంచాంగ ప్రభావం

చంద్రగతిని అనుసరించి బవాది 11 కరణాలు వరుసగా తిథిలో సగ భాగాన్ని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం అవుతుంది.[1]

పంచాంగం ప్రకారం కరణములు 11.

 1. బవ
 2. భాలవ
 3. కౌలవ
 4. తైతుల
 5. గరజి
 6. పణజి
 7. భద్ర
 8. శకునే = శకుని
 9. చతుష్పాతు
 10. నాగవము
 11. కీమస్తుఘ్నము

చంద్రగతిని అనుసరించి బవాది 11 కరణాలు వరుసగా తిధిలో సగభాగంగా లెక్కిస్తారు. శుభతిథిని ఎన్నుకుని పని - ప్రారంభిస్తే సంపద, వారం వల్ల - ఆయుషు, నక్షత్రం వల్ల పుణ్యం, యోగం వల్ల వ్యాధినాశం, కరణం వల్ల ఇష్టకామ్యం సిద్ధిస్తాయి. కాబట్టి వివాహాది శుభకార్యాలను సుముహూర్తంలో ప్రారంభించడం వల్ల కార్యసిద్ధి, విజయం ప్రాప్తిస్తాయని పెద్దలు చెబుతారు.

మూలాలు

మార్చు
 1. HariOme (2016-04-08). "పంచాంగం లో, జ్యోతిషం లో కరణం అంటే ఏమిటి? | What is Karanam in Astrology and Panchangam Telugu? • Hari Ome". Hari Ome (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2017-07-22. Retrieved 2020-04-15.
"https://te.wikipedia.org/w/index.php?title=కరణం&oldid=3903379" నుండి వెలికితీశారు