కర్ణాటక ఒప్పందం

ఆర్కాట్ నవాబ్ మధ్య ఒప్పందం

కర్ణాటక ఒప్పందం ఆర్కాట్ నవాబుకూ ఈస్టిండియా కంపెనీకీ మధ్య 1801 జూలై 26 న కుదిరిన ఒప్పందం. భారత ఉపఖండంపై పట్టు సాధించడంలో బ్రిటిషు సామ్రాజ్యానికి తోడ్పడిన ఒప్పందాలలో ఇది ఒకటి. ఒప్పందం ప్రకారం నవాబు, ఉత్తర ఆర్కాట్, దక్షిణ ఆర్కాట్, తిరుచిరాపల్లి, మదురై, తిరునెల్వేలి జిల్లాలను, వాటిపై పరిపాలనాధికారాలను కంపెనీకి అప్పగించాడు.[1]

నవాబ్ అజీమ్-ఉద్-దౌలా, మేజర్-జనరల్ ఆర్థర్ వెల్లెస్లీలు చెపాక్ ప్యాలెస్‌లో కర్ణాటక ఒప్పందంపై సంతకం చేశారు.

నేపథ్యం

మార్చు

ఈ ఒప్పందం ఫలితంగా తమిళనాడులోని స్థానిక అధిపతులందరూ తుడిచిపెట్టుకుపోయారు. ఈస్టిండియా కంపెనీ తమిళనాడుపై నేరుగా నియంత్రణ సాధించింది. కంపెనీ, పాలెగాళ్ళ కోటలను పడగొట్టి, వారి సైన్యాన్ని రద్దు చేసి, పాలెగాళ్ళ వ్యవస్థకు ముగింపు పలికింది. దీని ఫలితంగా కంపెనీకి ఈ ప్రాంతంపై పూర్తి నియంత్రణ దక్కింది.[2][3]

పరిణామాలు

మార్చు

ఒడంబడిక ప్రకారం, ఆర్కాట్ నవాబు (ఇతన్నే కర్నాటక నవాబు అని కూడా అంటారు) పాలెగాళ్ళ భూభాగాలతో సహా తన రాజ్యాన్నంతటినీ బ్రిటిషు వారికి అప్పగించాడు. రాజ్యపు మొత్తం ఆదాయంలో ఐదవ వంతు తనకు దక్కేలా ఒప్పందంలో రాసుకున్నాడు . [4]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. John Malcolm (1826). The Political History of India, from 1784 to 1823, Volume 1. p. 1.
  2. . "British Annexation of the Carnatic, 1801".
  3. "Importance of the Treaty of 1801 – Social Science". shaalaa.com (in Indian English).
  4. Commons, Great Britain Parliament House of (1861). Parliamentary Papers (in ఇంగ్లీష్). H.M. Stationery Office. p. 57.