కలికి చిలకల కొలికి

కలికి చిలకల కొలికి అనే సినిమా పాటను వేటూరి సుందరరామమూర్తి రచించినది. దీనిని సీతారామయ్యగారి మనవరాలు (1991)లో విడుదలైన సినిమాలో మీనా పై చిత్రీకరించారు. దీనికి సంగీతం ఎం. ఎం. కీరవాణి అందించారు. తరతరాలుగా పుట్టింటి ప్రయాణం పెళ్ళైన మహిళలందరికీ ఎంతో ఆనందాన్నిస్తుంది. ఈ విషయం గురించి చాలా స్త్రీల పాటలు రచించబడ్డాయి. తెలుగు ఆడపడుచుల మనసులోని మాటగా, ఒకనాటి ఉమ్మడి కుటుంబాల జీవనచిత్రంగా, తెలుగు పదబంధాల్లోని సొగసుకు నిలువుటద్దంగా ఈ పాట తెలుగు సినీ సాహిత్యంలో కలకాలం నిలిచివుంటుంది.[1]

"కలికి చిలకల కొలికి"
సంగీతంఎం.ఎం.కీరవాణి
సాహిత్యంవేటూరి సుందరరామమూర్తి
ప్రచురణ1991
భాషతెలుగు
రూపంస్త్రీల పాట

నేపథ్యంసవరించు

పెళ్ళైన తర్వాత ఊరికి చెందిన డబ్బు విషయంలో తండ్రికి, మామకి గొడవ జరిగిన కారణం చేత తన మేనత్తను పుష్కరంపాటు పుట్టింటికి పంపించదు. అలా అమ్మానాన్నలకు, పుట్టిపెరిగిన ఊరికి దూరమైన ఆడపడుచు వేదనకు ప్రతిరూపం ఈ పాట. అలాంటి తరుణంలో అమెరికా నుండి వచ్చిన మేనకోడలు ఇంటిల్లిపాదినీ ఒప్పించి మేనత్తని పుట్టింటికి తీసుకొని వెళ్ళాలనుకొనే సందర్భంలో దీనిని చేర్చారు.

పాటలో కొంత భాగంసవరించు

కలికి చిలకల కొలికి మా మేనత్త
కలవారి కోడలు కనకమాలక్ష్మి
అత్తమామల కొలుచు అందాల అతివ
పుట్టిల్లు ఎరుగని పసి పంకజాక్షి...

పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది
పుట్టింటికి మనసు పరుగుతీస్తుంది
తెలుసుకో తెలుసుకో తెలుసుకో
తెలుసుకో మనసున్న మామా
సయోధ్య నేలేటి సాకేతరామా

సాహిత్య సౌరభాలుసవరించు

ఈ అచ్చమైన తెలుగు పాటలో వేటూరి అంత్యప్రాసను పాటించారు. "తలలో నాలుక", "ఏడుమల్లెలు తూగు" వంటి జాతీయాలు, "పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది" వంటి సామెతలు, "కలికి చిలకల కొలి", "తేనె నీరెండ" వంటి పదచిత్రాలు ఈ పాట విలువను పెంచాయి.

మూలాలుసవరించు

  1. పవన్ సంతోష్, సూరంపూడి (జనవరి 2014). "కలికి చిలకల కొలికి". తెలుగు వెలుగు: 82–83.