కలియుగ 2020లో విడుదలైన తెలుగు సినిమా. గుమ్మడి రవీంద్రబాబు సమర్పణలో బాలాజీ సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై సి.హెచ్. సుబ్రమణ్యం నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఏ తిరుపతి దర్శకత్వం వహించాడు. విశ్వా, స్వాతి దీక్షిత్, శశి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 6న విడుదలైంది.[1]

కలియుగ
దర్శకత్వంఎం.ఏ తిరుపతి
స్క్రీన్ ప్లేఎం.ఏ తిరుపతి
నిర్మాతసి.హెచ్. సుబ్రమణ్యం
తారాగణంవిశ్వా
స్వాతి దీక్షిత్
శశి కుమార్
ఛాయాగ్రహణంసత్య వి ప్రభాకర్
సంగీతంకమల్ డి
నిర్మాణ
సంస్థ
బాలాజీ సిల్వర్ స్క్రీన్స్
విడుదల తేదీ
2020 డిసెంబర్ 6
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ సవరించు

వెంకట్ (సూర్య) ప్రకాష్ (శశి కుమార్ రాజేంద్రన్) ఇద్దరూ మంచి మిత్రులు. ప్రకాష్ ను వెంకట్ ను దారుణంగా కాల్చి చంపేస్తాడు. పోలీస్ లు వెంకట్ ను పట్టుకునే క్రమంలో చందు (విశ్వ) అనే వ్యక్తి ప్రకాష్ ను చంపింది నేను అంటూ పోలీస్ లకు లొంగిపోతాడు. ఇంతకీ ఈ చందు ఎవరు ? ఇతనికీ వెంకట్ కి సంబంధం ఏమిటి ? అసలు ఇంతకీ ప్రాణ స్నేహితుడైన ప్రకాష్ ను వెంకట్ ఎందుకు చంపాడు ? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు సవరించు

సాంకేతిక నిపుణులు సవరించు

  • బ్యానర్: బాలాజీ సిల్వర్ స్క్రీన్స్
  • నిర్మాత: సి.హెచ్. సుబ్రమణ్యం
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎం.ఏ తిరుపతి
  • సంగీతం: కమల్ డి
  • సినిమాటోగ్రఫీ: సత్య వి ప్రభాకర్
  • పాటలు: వరికుప్పల యాదగిరి శివ, శ్రీరామ్ తపస్వీ
  • గాయకులు: రేవంత్, శిల్ప, ధనుంజయ్, ప్రదీప్ సోమసుందరన్, వరికుప్పల యాదగిరి, కమల్ కుమార్[2]

మూలాలు సవరించు

  1. The Times of India (6 December 2019). "Kaliyuga Movie". Archived from the original on 30 April 2022. Retrieved 30 April 2022.
  2. 10TV (29 November 2019). "పవర్‌స్టార్ చేతుల మీదుగా 'కలియుగ' పాటలు విడుదల" (in telugu). Archived from the original on 30 April 2022. Retrieved 30 April 2022.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
"https://te.wikipedia.org/w/index.php?title=కలియుగ&oldid=3550143" నుండి వెలికితీశారు