కల్పనా సైనీ (జననం 1 అక్టోబరు 1959) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2022లో జరిగిన రాజ్యసభ ఎన్నికలలో ఉత్తరాఖండ్ నుండి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1][2]

కల్పనా సైనీ
కల్పనా సైనీ


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
5 జులై 2022
ముందు ప్రదీప్ టామ్టా
నియోజకవర్గం ఉత్తరాఖండ్

వ్యక్తిగత వివరాలు

జననం (1971-08-04) 1971 ఆగస్టు 4 (వయసు 53)
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి డా. నాతిరామ్ సైనీ
సంతానం ఒక కొడుకు, కూతురు

జననం, విద్యాభాస్యం

మార్చు

కల్పన భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హరిద్వార్ జిల్లాలోని (శివదాస్‌పూర్-తెలివాలా) రూర్కీ గ్రామంలో 01 అక్టోబర్ 1959న పృథ్వీ సింగ్ విక్షిత్, కమలా దేవి దంపతులకు జన్మించింది. ఆమె సంస్కృతంలో పీహెచ్‌డీ పట్టా పొందింది.

రాజకీయ జీవితం

మార్చు

కల్పనా సైనీ ప్రిన్సిపాల్‌గా ఉద్యోగం చేస్తున్న సమయంలో 1990లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌తో సంబంధం కలిగి ఉంది. ఆమె 1995లో రూర్కీ మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా ఎన్నికైంది. ఆమె 2003 నుండి 2005 వరకు ఉత్తరాఖండ్ ప్రధానాచార్య పరిషత్ రాష్ట్ర అధ్యక్షురాలిగా, రూర్కీ జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా, నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ డైరెక్టర్‌గా, ఉత్తరాఖండ్ రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శిగా వివిధ హోదాల్లో పని చేసి 2019లో ఉత్తరాఖండ్ ప్రభుత్వ వెనుకబడిన కమిషన్ చైర్‌సన్‌గా నియమితురాలైంది. కల్పనా సైనీ 2022లో జరిగిన రాజ్యసభ ఎన్నికలలో ఉత్తరాఖండ్ నుండి రాజ్యసభ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైంది.[3][4][5]

మూలాలు

మార్చు
  1. The Times of India (4 June 2022). "BJP's Kalpana Saini elected to Rajya Sabha". Archived from the original on 21 May 2024. Retrieved 21 May 2024.
  2. News18 हिंदी (29 May 2022). "Rajya Sabha Election: बीजेपी ने उत्तराखंड से डॉ. कल्‍पना सैनी को बनाया प्रत्‍याशी, जानें उनके बारे में सबकुछ" (in హిందీ). Archived from the original on 21 May 2024. Retrieved 21 May 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. The Times of India (30 May 2022). "BJP picks OBC panel chief Kalpana Saini for RS seat". Archived from the original on 21 May 2024. Retrieved 21 May 2024.
  4. The New Indian Express (3 June 2022). "BJP's Kalpana Saini elected unopposed to Rajya Sabha from Uttarakhand" (in ఇంగ్లీష్). Retrieved 21 May 2024.
  5. India Today (4 June 2022). "41 candidates elected unopposed to Rajya Sabha | Full list here" (in ఇంగ్లీష్). Archived from the original on 21 May 2024. Retrieved 21 May 2024.