కళ్యాణి ఆనకట్ట,తిరుపతికి దగ్గరలో కళ్యాణి నదిపై కట్టిన ఆనకట్ట. కళ్యాణి, సువర్ణముఖి నదికి ఉపనది. తిరుపతిలో ప్రధానంగా నీటి సరఫరా కళ్యాణి జలాశయం నుంచే జరుగుతుంది.[1] ప్రకృతి సుందరమైన ఈ అనకట్ట తిరుపతి- మదనపల్లె మార్గ మధ్యంలో రంగంపేట అడవుల్లో, తిరుపతి పట్టణానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది. చుట్టుపక్కల గ్రామస్థులను, పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ ఆనకట్టను 1977 లో నిర్మించారు.[2]

కళ్యాణి ఆనకట్ట
కళ్యాణి ఆనకట్ట is located in ఆంధ్రప్రదేశ్
కళ్యాణి ఆనకట్ట
ఆంధ్రప్రదేశ్ లో కళ్యాణి ఆనకట్ట స్థానం
అధికార నామంకళ్యాణి ఆనకట్ట
దేశంభారత దేశం
ప్రదేశంతిరుపతి
అక్షాంశ,రేఖాంశాలు13°39′27.5″N 79°16′9.4″E / 13.657639°N 79.269278°E / 13.657639; 79.269278
ఆవశ్యకతసాగునీరు, తాగునీరు
యజమానిఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఆనకట్ట - స్రావణ మార్గాలు
ఆనకట్ట రకంగ్రావిటీ డ్యామ్
నిర్మించిన జలవనరుకళ్యాణి నది
జలాశయం
పరీవాహక ప్రాంతం48.56 కి.మీ2 (18.75 చ. మై.)

కళ్యాణి నది పాలకొండ అడవుల్లో పుట్టింది. అనేక వాగులు వంకలూ అందులో కలుస్తాయి. వాటిలో ప్రధానమైనవి: మామిడ్లమానుకోన వంక, పగడగుండ్ల వంక, మొర్రావుకోన, తుంబకోన, రాగిమానుకోన, తేళ్ళబండకోన, అనుమకోన, చింతకుంటలకోన.

మూలాలు

మార్చు
  1. "Two spillway gates of Kalyani Dam lifted". Retrieved 23 November 2015.
  2. "Geotechnical investigations at the Kalyani dam site, Chitoor District, Andhra Pradesh, India". సైన్స్ డైరెక్ట్. Archived from the original on 2020-07-15. Retrieved 2020-07-15.