కవాతును కవాత్ అని కూడా అంటారు. కవాతును హిందీలో పథ్ సంచలన్, ఆంగ్లంలో రూట్ మార్చి అంటారు. కవాతు అంటే పథములో సంయుక్తంగా కదలటం. ఒక ప్రత్యేక సందర్భంలో అనేక మంది ఒకే ఉద్దేశంతో ఈ కవాత్ ను నిర్వహిస్తారు. ఈ కవాతును నిర్వహించడం ద్వారా ప్రజలకు లేదా సంబంధికులకు ఒక సందేశాన్ని అందిస్తారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వారు చేస్తున్న కవాతు (పథ్ సంచలన్)

RSS పథ్ సంచలన్

మార్చు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వారు చేసే పథ్ సంచలన్ చాలా ప్రముఖమైనది, ప్రసిద్ధి చెందినది. ఈ పథ్ సంచలన్ లో పాల్గొనే వారు కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది. తెల్లచొక్కా (పొడుగు చేతులు), కాకీనికరు (సంఘ్ నికరు), సంఘ్ వారు ఇచ్చే నల్లటోపి, సంఘ్ వారు ఇచ్చే బ్రౌన్ బెల్ట్, నలుపు రంగు షూ (పదవేస్),, దండ (భుజం ఎత్తు ఉండే చక్కని వెదురు కర్ర) మొదలగునవి పథ్ సంచలన్ యొక్క డ్రస్ కోడ్. పథ్ సంచలన్ చేసేటప్పుడు వాయించే వాద్యనాదాన్ని ఘోష్ నాదం అంటారు. ఆనక్, ప్రణవ, వంశీ, శంఖ, జలరి నాదం మొదలగునవి ఘోష్ నాదంలో ఉపయోగించే వాద్య పరికరాలు. పథ్ సంచలన్ లో ఉపయోగించే జెండాను భగవాధ్వజం అంటారు.

"https://te.wikipedia.org/w/index.php?title=కవాతు&oldid=2879436" నుండి వెలికితీశారు