కవితా సెల్వరాజ్
కవితా సెల్వరాజ్ కబడ్డీ క్రీడలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది. 2010లో గ్వాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడలలో బంగారు పతకం సాధించిన జట్టులో ఆమె సభ్యురాలు.[1][2] ఆమె భారత మహిళా కబడ్డీ జట్టు కోచ్ కూడా.
Medal record | |||
---|---|---|---|
ప్రాతినిధ్యం వహించిన దేశము భారతదేశం | |||
మహిళల కబడ్డీ | |||
[ఆసియా క్రీడలు]] | |||
స్వర్ణము | 2010 గ్వాంగ్జౌ | టీం |
2010 ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించడానికి ముందు 2007, 2008 ఆసియా కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లలో వరుసగా రెండు బంగారు పతకాలు సాధించిన అద్భుతమైన కెరీర్ ఆమెది.
కవిత కబడ్డీలో తన కృషికి ధ్యాన్‌చంద్ అవార్డు (జీవితకాల సాఫల్యానికి) వరించింది.[3] భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారం జనవరి 2024లో ఆమె అందుకుంది.
క్రీడలలో జీవితకాల సాఫల్యానికి ధ్యాన్ చంద్ అవార్డు, అద్భుత ప్రదర్శన కనబరిచిన భారతీయ క్రీడాకారులు, వారి పదవీ విరమణ తర్వాత క్రీడా ఈవెంట్‌ల ప్రమోషన్‌కు సహకరించే క్రీడాకారులను సత్కరించడానికి ప్రతియేటా ఇవ్వబడుతుంది.
మూలాలు
మార్చు- ↑ Vinod, A. (Nov 29, 2010). "Kerala still in celebratory mood after Asiad impression". The Hindu. The Hindu Group. Archived from the original on April 2, 2011. Retrieved 15 December 2012.
- ↑ "Colourful start to district youth fete". The Hindu. The Hindu Group. January 8, 2011. Retrieved 15 December 2012.
- ↑ "Proud moment for me: Indian women's kabaddi coach Kavitha Selvaraj on receiving Dhyan Chand Award". web.archive.org. 2024-08-17. Archived from the original on 2024-08-17. Retrieved 2024-08-17.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)