కశేరు నాడులు
కశేరు నాడులు (Spinal nerves) జంతువులలో వెన్నుపూసల సంఖ్యకు సమానంగా ఉంటాయి. ఇవి బూడిద వర్ణపు పదార్థం నుంచి పృష్ఠ, ఉదర శృంగికల నుంచి ఏర్పడే రెండు మూలాల కలయిక వల్ల ఏర్పడతాయి. పృష్టమూలం జ్ఞాన సంబంధమైనది. ఉదర మూలం చాలక సంబంధమైనది. ఆ విధంగా ఏర్పడిన కశేరు నాడులు మిశ్రమ నాడులు. ఇవి వెన్నెముకలోని అంతర్ కశేరు రంధ్రాల ద్వారా బయటికి వస్తాయి. ఒక్కొక్క కశేరు నాడి మూడు శాఖలుగా చీలుతుంది. పృష్ఠశాఖ చర్మానికి, పృష్ఠ కండరాలకు సరఫరా చేస్తుంది. ఉదర శాఖ శరీరంలోని పార్శోదర భాగాలకు సరఫరా చేయగా, మూడో శాఖ సహానుభూత నాడీ వ్యవస్థతో కలిసి అంతరాంగాలకు సరఫరా చేస్తుంది.

మనుషులలో కశేరు నాడులు సవరించు
మనుషులలో మొత్తం 31 జతల కశేరు నాడులుంటాయి. అవి :
- 8 గ్రీవ కశేరు నాడులు (C1-C8)
- 12 ఉరః కశేరు నాడులు (T1-T12)
- 5 కటి కశేరు నాడులు (L1-L5)
- 5 త్రిక కశేరు నాడులు (S1-S5)
- 1 పుచ్ఛ కశేరు నాడి (Co)
Look up కశేరు నాడులు in Wiktionary, the free dictionary.