కాంకోర్డియా మెరెల్

కాంకోర్డియా మెర్రెల్ (జననం మేరీ ఫిల్లిస్ జోన్ లోగాన్ ; 1885 సెప్టెంబరు 10 – 1962 మే 18) ఆంగ్ల సినిమా నటి. ఈమె చాలా సినిమాలలో మూగ పాత్రలలో నటించింది. ఈమె ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జన్మించింది. రచయితగా పలు రచనలను రచించింది.

కాంకోర్డియా మెరెల్
జననం1885 సెప్టెంబర్ 10
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ , భారతదేశం
మరణం1962 మే 18
లండన్, ఇంగ్లాండ్,
వృత్తినటి మోడల్
క్రియాశీలక సంవత్సరాలు1909–1956
పిల్లలు3

జీవిత చరిత్ర మార్చు

ఆమె భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో 1885లో జన్మించింది. ఈమె విద్య అంతా విశాఖపట్నంలోనే గడిచింది. ఉపాధ్యాయులు ఈమెకు సహకరించేవారు. 1891లో ఈమె తల్లికి అనారోగ్యం కారణంగా ఇంగ్లాండ్ దేశానికి వెళ్లారు. ఈమె తల్లితండ్రులు ఈమె చిన్నతనంలోనే విడాకులు తీసుకున్నారు.[1] ఈమె పుట్టింది ఆంధ్రప్రదేశ్లో అయినా పెరిగింది మాత్రం ఇంగ్లాండ్లో. ఈమె తండ్రి ఈమెను గారాబం చేసేవాడు. ఈమె తల్లిదండ్రులు చిన్నప్పుడే విడాకులు తీసుకోవడంతో తండ్రి వద్ద పెరిగింది. ఈమెకు తల్లి స్పర్శ లేదు.

 
1909 లో కాంకోర్డియా మెరెల్,

ఆమె యవ్వనంలో, ఆమె ఫోటోగ్రాఫర్ 1910లో మోర్టన్ ను వివాహం చేసుకుంది. 1913లో ఈమె సినీ రంగంలోకి ప్రవేశించింది. ప్రముఖ ఆంగ్ల నటుడు కావెండిష్ మోర్టన్ సరసన నటించింది. ఈమె నటించిన సినిమాలు లండన్‌లోని లిటిల్ థియేటర్‌లో విడుదల అయ్యేవి .[2] ఈమెఎ స్మార్ట్ సెట్ (1919), జోన్ ఇన్ ది లాస్ట్ కార్డ్ (1917), మార్గరెట్ ఇన్ ఏవ్ మారియా (1918) మిసెస్ ఫ్లీటర్ ఇన్ మై స్వీట్‌హార్ట్ (1918) లాంటి సినిమాలలో నటించింది.[3][4]

ఆమె 1920 నుంచి రచనలను రచించడం ప్రారంభించింది. 1956 లో చివరిగా ఆమె రచించింది. ఆమె రచనలు నాలుగు భాషల్లోకి అనువదించబడ్డాయి.[5]

ఈమె వీలునామాలో నేను మరణించిన తర్వాత ఆస్తి మొత్తం పేదలకు చెందుతుంది అని రాసి ఉంది.[6]

రచనలు మార్చు

  • జాన్ గ్రేషమ్స్ గర్ల్, లండన్ హోడర్ & స్టౌటన్, 1926
  • లవ్స్ హజార్డ్, లండన్ హోడర్ & స్టౌటన్, 1934
  • ది సావేజ్, లండన్ హోడర్ స్టౌటన్, 1931
  • ఇద్దరు పురుషులు సాలీ, లండన్ : హోడర్ స్టౌటన్, 1926
  • ద మాన్ వితౌట్ మెర్సీ, లండన్ హోడర్ & స్టౌటన్, 1929
  • జూలియా తన అవకాశాన్ని, లండన్ తీసుకుంటుంది సెల్విన్ & బ్లౌంట్, 1920
  • ది మిరాకిల్ మర్చంట్, లండన్ హోడర్ & స్టౌటన్, 1928
  • సాలీ అమాంగ్ ది స్టార్స్, లండన్ హోడర్ స్టౌటన్, 1930
  • ది అన్‌కాంకరబుల్ గర్ల్, లండన్ హోడర్ & స్టౌటన్, 1927
  • ఆశ్చర్యకరమైన వివాహం, లండన్ : హోడర్ స్టౌటన్, 1932
  • ది ఫ్యాన్షావే ఫ్యామిలీ, లండన్ : హోడర్ & స్టౌటన్,1925
  • ది క్యాడ్స్ పార్టీ, లండన్ హోల్డర్ స్టౌటన్, 1931
  • ది హౌస్ ఆఫ్ ఎస్టర్డే, లండన్ హోడర్ & స్టౌటన్, [1932]
  • జాక్వెలిన్ , లవ్, లండన్ హోడర్ & స్టౌటన్, [1925]
  • లవ్ ఇన్ ఫెటర్స్, లండన్ హోడర్ & స్టౌటన్, 1925
  • ది షాడో ఆఫ్ రెడ్ మాసన్, లండన్ హోడర్ & స్టౌటన్, 1930
  • ది మ్యారేజ్ ఆఫ్ అన్నే, లండన్ : హోడర్ స్టౌటన్, 1927
  • ర్యాగ్డ్ రాబిన్, లండన్ హోడర్ & స్టౌటన్, 1925
  • ఏడవ మిస్ బ్రౌన్, లండన్ హోడర్ స్టౌటన్, 1927
  1. "Ancestry - Sign In". www.ancestry.co.uk.
  2. J. P. Wearing, The London Stage 1910-1919: A Calendar of Productions, Performers, and Personnel, Rowman & Littlefield (2014) - Google Books
  3. "Concordia Merrill". BFI. Archived from the original on 13 November 2022.
  4. Alan Goble, The Complete Index to Literary Sources in Film, Bowker Saur (1999) - Google Books pg. 358
  5. "Merrel, Concordia [WorldCat Identities]".
  6. "Ancestry - Sign In". www.ancestry.co.uk.