కాజీపేట హజ్రత్ సయ్యద్ షా అఫ్జల్ బియబాని దర్గా

ప్రపంచ ప్రసిద్థిగాంచిన ఈ దర్గా హన్మకొండ జిల్లా, వరంగల్ పట్టణానికి ఖాజీపేట రైల్వే స్టేషనుకు సూమారు 2 కి.మీ.ల దూరంలో ఉంది.

కాజీపేట హజ్రత్ సయ్యద్ షా అఫ్జల్ బియబాని దర్గా
పేరు
ప్రధాన పేరు :కాజీపేట హజ్రత్ సయ్యద్ షా అఫ్జల్ బియబాని దర్గా
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:వరంగల్లు జిల్లా
ప్రదేశం:ఖాజీపేట మండలం, ఖాజీపేట గ్రామం.
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:అఫ్జల్ బియబాని
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :ముస్లీం

దర్గా చరిత్ర

మార్చు

అఫ్జల్‌ బియబాని అనే సూఫీ సంతుడు పేదల పెన్నిధి. ఆయన తన మహిమలచేత ఎందరినో రక్షించాడు. రోగులకు స్వస్థత చేకూర్చాడు. ఆయన మరణానంతరం 1856లో ఆయన సమాధినే ఈ దర్గాగా నిర్మించారు.

మతసామరస్య ప్రతీక

మార్చు

ఈ దర్గాను హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు అనే భేదభావం లేకుండా భారతదేశంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు, పర్యాటకులు సందర్శిస్తుంటారు. అందుకే ఈ దర్గా మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది.

దర్గా విశిష్టత

మార్చు

ఈ దర్గాకు ఓ విశిష్టత ఉంది. ప్రపంచంలోని మూడు ప్రముఖ దర్గాల్లో ఇది ఒకటి. మిగతా రెండూ బాగ్దాద్‌, మదీనాలో ఉన్నాయి. ఈ దర్గాకు ఆకుపచ్చరంగు ఉంటుంది. కేవలం ప్రతిష్ఠ కల్గిన వ్యక్తుల దర్గాలకే ఆకుపచ్చ రంగు ఉంటుందట. భూత, ప్రేత, పిశాచాలు ఆవహించిన వారికి ఈ దర్గాలో స్వస్థత చేకూరుతుందని చాలా మంది భక్తుల నమ్మకం.

ఉర్సు ఉత్సవాలు

మార్చు

సంవత్సరానికి ఒకసారి ఈ దర్గాలో జరిగే ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు దేశం నలుమూలల నుండి ముస్లిములతో పాటు ఇతర మతస్థులు కూడా వచ్చి సోదరభావంతో కలిసి పాల్గొంటారు.

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు