కాత్యాయనీ దుర్గా

కాత్యాయనీ దుర్గాదేవి, నవదుర్గల్లో ఆరో అవతారం. నవరాత్రుల్లో ఆరవ రోజైన ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు భక్తులు.[1] అమరకోశం పార్వతీదేవికి ఇచ్చిన రెండో పేరు కాత్యాయనీ. శాక్తేయంలో ఈ అమ్మవారిని శక్తి, దుర్గ, భద్రకాళి, చండికల అపర అవతారంగా భావిస్తారు.[2] పతంజలి రాసిన మహాభాష్యంలో కాత్యాయనీ అమ్మవారిని దుర్గదేవిగా వర్ణించారు. ఇది క్రీ.పూ రెండో శతాబ్దంలో రాశారు.[3]

రాక్షస సంహారం చేస్తున్న కాత్యాయనీ దేవి

యజుర్వేదంలోని త్రైతీయ అరణ్యకలో మొట్టమొదటే ఈ ఆమ్మవారి ప్రస్తావన వస్తుంది. స్కంద పురాణం ప్రకారం   సింహవాహిని అయిన ఈ  అమ్మవారు మహిషాసుర  సంహారంలో పార్వతీదేవికి సహాయం  అందించింది. నవరాత్రుల సమయంలో ఈ అమ్మవారిని భారతదేశమంతటా పూజిస్తారు.[4]

మార్కండేయ పురాణం, దేవి భాగవతాలలో కూడా ఈ అమ్మవారి గురించి ప్రస్తావన చూడవచ్చు. బౌద్ధ, జైన గ్రంధాలలో కూడా ఈ అమ్మవారి గురించి ఉండటం విశేషం. ముఖ్యంగా కాళికా పురాణంలో కాత్యాయనీదేవి గురించి ప్రస్తావస్తూ ఓడిశా ప్రదేశం జగన్నాధునికీ, కాత్యాయనీ దేవికి పీట వంటిది అని వివరించారు.[5]

హిందూ శాస్త్రాలు, యోగ, తంత్ర విద్యల ప్రకారం కాత్యాయనీ దేవి అజ్ఞా చక్రానికి అధిష్ఠాన దేవత. ఈ అమ్మవారిని ధ్యానించడం వల్ల ఏకాగ్రత బాగా ఉంటుందని విశ్వాసం.[1]

ధ్యాన శ్లోకం:

చంద్రహాసోజ్వలకరా శార్దూలవరవాహనా!

కాత్యాయినీ శుభం దద్యాదేవి దానవఘాతినీ!!

మూలాలు

మార్చు

కాత్యాయనీ దుర్గాదేవి, నవదుర్గల్లో ఆరో అవతారం. నవరాత్రుల్లో ఆరవ రోజైన ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు భక్తులు.[1] అమరకోశం పార్వతీదేవికి ఇచ్చిన రెండో పేరు కాత్యాయనీ. శాక్తేయంలో ఈ అమ్మవారిని శక్తి, దుర్గ, భద్రకాళి, చండికల అపర అవతారంగా భావిస్తారు.[6] పతంజలి రాసిన మహాభాష్యంలో కాత్యాయనీ అమ్మవారిని దుర్గదేవిగా వర్ణించారు. ఇది క్రీ.పూ రెండో శతాబ్దంలో రాశారు.[శ్లోకం 1]

శ్లోకం:-

  1. 1.0 1.1 1.2 "The Sixth form of Durga". Archived from the original on 2017-05-11. Retrieved 2016-10-07.
  2. Religious beliefs and practices of North India during the early medieval period, by Vibhuti Bhushan Mishra.
  3. Devī-māhātmya: the crystallization of the goddess tradition, by Thomas B. Coburn.
  4. CHAPTER VII.
  5. Uddiyana Pitha Iconography of the Buddhist Sculpture of Orissa: Text, by Thomas E. Donaldson, Indira Gandhi National Centre for the Arts.
  6. Religious beliefs and practices of North India during the early medieval period, by Vibhuti Bhushan Mishra.


ఉల్లేఖన లోపం: "శ్లోకం" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="శ్లోకం"/> ట్యాగు కనబడలేదు