కాన్సాస్ సిటీ హిందూ దేవాలయం

మిస్సోరి రాష్ట్రం, కాన్సాస్ సిటీ మెట్రోపాలిటన్ ప్రాంతంలోని ఉన్న ఒక హిందూ దేవాలయం.

కాన్సాస్ సిటీ హిందూ దేవాలయం, మిస్సోరి రాష్ట్రం, కాన్సాస్ సిటీ మెట్రోపాలిటన్ ప్రాంతంలోని ఉన్న ఒక హిందూ దేవాలయం.

కాన్సాస్ సిటీ హిందూ దేవాలయం
ప్రదేశం
దేశం:యునైటెడ్ స్టేట్స్
రాష్ట్రం:కాన్సాస్
ప్రదేశం:షావ్నీ
అక్షాంశ రేఖాంశాలు:39°00′47″N 94°45′43″W / 39.013117°N 94.762028°W / 39.013117; -94.762028

చరిత్ర మార్చు

1982లో స్థానిక హిందూ, జైన ప్రజలు హిందూ దేవాలయం ఆవశ్యకత గురించి చర్చించి జాన్సన్ కౌంటీలో ఒక హిందూ దేవాలయాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు వేశారు. 4 కుటుంబాలు హిందూ దేవాలయ నిర్మాణంకోసం ఒక సంస్థను స్థాపించడానికి అభ్యర్థనలు పంపడంతోపాటు, దేవాలయం నిర్మించబడే స్థలాన్ని కొనుగోలు చేయడానికి విరాళాలు అడిగారు. 1983 మేలో ఐఆర్ఎస్ ద్వారా మతపరమైన సంస్థగా గుర్తించబడింది. పన్ను మినహాయింపు హోదా కూడా ఇవ్వబడింది.[1] కాన్సాస్ నగర ప్రాంతంలో ఎక్కువమంది హిందువులు నివసించే ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతంలో 5 ఎకరాల భూమిని కొనుగోలు చేసారు.[2] 1985 అక్టోబరు 27న శంకుస్థాపన కార్యక్రమంతో దేవాలయ నిర్మాణం ప్రారంభమై 1988 మే 22న వేలాదిమంది హిందూ భక్తుల సమక్షంలో ప్రారంభోత్సవం జరిగింది. భారతదేశం నుండి అనేక దేవతామూర్తుల విగ్రహాలు దిగుమతి చేయబడ్డాయి. దేవాలయం లోపల, బయట వివిధ హిందూ & జైన దేవతలు బొమ్మలు చెక్కబడ్డాయి. 1991 ఏప్రిల్ లో దేవాలయ రూపకల్పన పూర్తయింది.[3] అన్ని హిందూ పండుగలు ఇక్కడ జరుపబడుతాయి.

పూజలు మార్చు

చతురస్రాకారంలో ఉన్న ఈ దేవాలయంలో దేవతామూర్తులకు ప్రత్యేకంగా చిన్నచిన్న గుడులు ఉన్నాయి. 16 భాషల్లో పూజాసేవలు ఉన్నాయి. నియమిత రుసుముతో దేవాలయం బయట హిందూ ఆచారాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.[4] ఇక్కడ తరగతి గదులు, ఫలహారశాల, వంటగది కూడా ఉన్నాయి.

సేవా కార్యక్రమాలు మార్చు

ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాల బాధితుల సహాయార్థం దేవాలయ యువజన బృందం ఆధ్వర్యంలో అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు, నిధుల సేకరణ జరుగుతాయి. 2010 హైతీ భూకంపం బాధితుల కోసం $6,000 పైగా విరాళాలు సేకరించింది.[5]

మూలాలు మార్చు

  1. "Hindu Temple and Cultural Center of Kansas City Inc". charity navigator. Retrieved 2 February 2022.
  2. Jain, K Swaran. "Temple History". htccofkc. Retrieved 2 February 2022.
  3. "Hindu Temple and Cultural Center of Kansas City". templesinindiainfo. Retrieved 2 February 2022.
  4. "Hindu Temple and Cultural Center of Kansas City". pluralism. Archived from the original on 6 ఫిబ్రవరి 2020. Retrieved 2 February 2022.
  5. Shepherd, Sara (3 November 2010). "At Shawnee temple, Kansas City's Hindus at home in their community". shawneedispatch. Archived from the original on 2 ఫిబ్రవరి 2022. Retrieved 2 February 2022.