కామన్ బర్డ్స్ (పుస్తకం)
Common Birds: రచయితలు: Salim Ali & Laeeqfutehally. National Book Trust ప్రచురణ,1967.రచయిత లిద్దరూ సుప్రసిద్ధ పక్షి శాస్త్రవేత్తలు. సలీం అలీ పేరు వినని వారు ఉండరు. గొప్ప పక్షి ప్రేమికులు, జీవితం అంతా అందుకోసం ధారపోసిన మహా పండితుడు, బాంబే నాచురల్ హిస్టరీ సొసైటీ వ్యవస్థాపకుడు కూడా. ఆయన భారత దేశపు పక్షులు మీద అనేక పుస్తకాలు రచించినా ఈ చిన్న పుస్తకం పక్షులను గురించి ప్రాథమిక విషయాలు తెలుసుకోవడానికి తోడ్పడుతుంది.
బర్డ్ వాచింగ్” లేక పక్షులను పరిశీలించి వాటి గురించిన భోగట్టా తెలుసుకోవడం అనే హాబీ వలసపాలకులు ఇంగ్లీషు వాళ్ళతోనే మనకు అబ్బింది. అంతకు ముందు పక్షులను గురించి మనకు తెలియదని కాదు. వాల్మీకి రామాయణం క్రౌంచపక్షుల మిధుంలో ఒకదానిని వేటగాడు చంపడతోనే కదా ఆరంభమైంది.పక్షిజీవితం నీటిపై, వృక్షాలపైన నివాసం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు రచయితలు. ప్రధానంగా 27 Ordersగా పక్షుల జాతులు విభజన చేయబడినవి. ఈ విశాలమైన Orders మరలా Families కుటుంబాలుగా విభజన చేయబడినవి. కుటుంబాల విభాగం తదుపరి దగ్గరి సంబంధాలున్న పక్షులను Genus గా విభాగం చేయబడి పక్షులకు సంబంధించిన విజ్ఞానం పరిశోధన చేయబడింది.
భారతదేశంలో ఇప్పుడు షుమారు 1200 species గా పక్షి జాతులున్నవి. ఒక్క మనదేశంలో ఇంత వైవిధ్య భరితమైన పక్షి సంతతి ఉండడం గొప్ప విషయం. వందల రకాల పక్షులు నివాసం ఉండడానికి అనుకూలమైన ప్రకృతి వైవిధ్యం కలిగిన దేశం మనది.
ఏయే పక్షులు యేయే ప్రాంతాల్లో నివాసం ఉంటాయి, అక్కడి వాతావరణానికి అనుగుణంగా అవి ఎలా సద్దుబాటుచేసుకొంటాయి, పక్షులు నివాసం ఉండే ప్రదేశాలు ఎలాంటివి? అవి ఎక్కడ నివాసం ఉంటాయి? పక్షి తన సహచరిని ఎలా సంపాదించుకొంటుంది? అవి ఎలాంటి గూళ్ళు కట్టుకుంటాయి? ఎలా గుడ్లు పొదిగి పిల్లలనుచేసి పెంచుతాయి? అర్ధశాస్త్రం దృష్టిలో పక్షుల సామాజిక వ్యవస్థ, పక్షులు సంఖ్యకు సంబంధించిన వివరాలు, వాటి ఆహారపు అలవాట్లు, పక్షిపిల్లల జీవితచక్రం ఎలా సాగుతుంది? పునరుత్పత్తి, గూళ్ళు పెట్టడం, ఆహారం సంపాదించుకోవడం, మానవులకు స్నేహితులయిన పక్షులు, వైరులైన పక్షులు, పక్షులు వలసలు వెళ్ళడం, మళ్ళీ తిరిగి రావడం, మనదేశానికి చెందిన పక్షులేవి, మన దేశంలోకి వలసలు వచ్చే పక్షులజాతులేవి? వంటి అనేక ప్రశ్నలకు రచయితలు సమాధానం చెప్పారు.
పక్షుల ఇంగ్లీషు పేర్లకు హిందీ, ఇతర భాషల్లో పేర్లు వగైరా అనేక విషయాలు చక్కగా ఈ పుస్తకంలో వివరించారు రచయితలు. నూరేళ్ళక్రితం సమృద్ధిగా ఉన్న పక్షిజాతులు ఇప్పుడు ఏల కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది? వంటి అనేక విషయాలు ఇందులో చర్చించబడ్డాయి.
ఈ పుస్తకంలో షుమారు మనదేశపు 100 పక్షి జాతులు, వాటిలో చిన్న చిన్న తేడాలు, ఉపజాతులు, అవి నివాసముండే ప్రదేశాలు, వాటి జీవితచక్రం, ఆడా, మగ పక్షుల భౌతిక రూపవర్ణన, తిండి అలవాట్లు, జతకట్టడం, గూళ్ళు కట్టడం, పొదగడంలో ఆడామగా పక్షులు నిర్వహించే బాధ్యతలు, ఇట్లా మనం ఎప్పుడూ గమనించని అనేక ఆసక్తికరమైన విషయాలు ఇందులో వివరించారు.
ఏ పిట్ట, ఏ పక్షి ఏరుతువులో పాడుతుందో, అసలెందుకు పాడుతుందో ఆ కూతలూ, అరుపుల వర్ణన ప్రతిదీ ఇచ్చారు.
మనం బాల్యంలో టెలిగ్రాఫ్ తీగలపై వరస్సగా పిట్టలు కొలువుతీరి ఉండడం, పొడవాటి గడపైనో, స్తంభం మీదో, నిట్రాతిమీదో, ఆవుమీదో వాలి ఉన్న పిట్టలు, రాత్రయితే మహా వృక్షాలపై చేరి, ఉదయం, సాయంకాలం మనోహరంగా పక్షులు కిలకిలారవాలు చేయడం, వసంత రుతువు రాగానే విసుగు విరామం లేకుండా కోయిల పాడే పాటలూ వినే ఉంటాము. అన్నిటికీ మనకు తెలియని ఎన్నో వివరణలు ఇందులో దొరుకుతాయి.
సామాన్య పాఠకులకు తెలియని అనేక విషయాలు ఇందులో వివరించారు, పాఠకులను పక్షులపట్ల, ప్రకృతిపట్ల, వాతావరణ సమతౌల్యంపట్ల సెన్సిటైజ్ చేసేందుకు ప్రయత్నం చేశారు రచయితలు.
మూలాలు
మార్చు- Ali, Salim; Laeeq Futehally (1967). Common Birds. New Delhi: National Book Trust.
Common Birds: Salim Ali & Laeeqfutehally. National Book Trust ప్రచురణ,1967