కారువా మేళ నృత్యం తెలుగునాట వర్థిల్లిన జానపద కళారూపాలలో ఒకటి.

తెలుగు నాట వర్థిల్లిన జానపద కళా రూపాలన్నీ అన్ని ప్రాంతాల్లోనూ ప్రచారంలో వున్నాయి. కొన్ని ముఖ్యమైన కళా రూపాలు తప్ప మిగిలిన వన్నీ ప్రాంతీయంగా అభివృద్ధి చెందాయి. అలా ప్రాంతీయంగా అభివృద్ధి పొందిన కళారూపం కారువా నృత్యం.

కారువా మేళ నృత్యం మార్చు

ఇది ఒక్క తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం ఈ నాటికీ ప్రచారంలో వుందంటారు. రాధాకృష్ణుల రాస లీలలు మాదిరి సమ సంఖ్యలో ఎనిమిది మంది గోపికలు గానూ, మరొ ఎనిమిది మంది కృష్ణులు గానూ వేషాలు ధరించుకుని, వలయాకారంగా నిలబడి నృత్యం చేస్తూ వుంటే వలయాకారపు మధ్య రాధాకృష్ణులు నాట్య మాడుతూ వుంటారు. వరుస క్రమంలో కృష్ణుడు, తరువాత గోపిక, మరల కృష్ణుడు, మరల గోపిక, ఇలా గుండ్రంగా నిలబడి నృత్యం చేయడాన్ని కారువా మేళంగా వర్ణించారు. దీని గురించి నాట్య శాస్త్రల్లో 'కర్షణీ ' నర్తనంతో పోల్చవచ్చు నంటారు. నటరాజ రామకృష్ణ గారు. ఉత్తర భారతదేశంలో ఈ నృత్యం రాస లీలా నృత్యంగా విరాజిల్లుతూ ఉంది.

ప్రదర్శన తీరు మార్చు

కారువా నాట్యం కేవలం సంగీత వాయిద్య ఆధారంతోనే ప్రదర్శింప బడుతుంది. ఇందులో పాటలు పాడటం చాల తక్కువ. వాద్య సంగీతం ప్రారంభమై ఉధృత లయతో అంత మొందుతుంది. నృత్యం కూడా ఆ వాయిద్యాల వేగానికి అనుగుణంగా ప్రారంభమై వేగాన్ని పుంజు కుంటుంది. పతాక స్థాయి నందుకున్న తరువాత మళ్ళీ ప్రాథమిక లయకు మారుతుంది.

లీలా నర్థన మార్చు

కారువా నాట్యంలో ఒక ప్రత్యేక భాగాన్ని లీలా నర్తనమని పిలుస్తారు. ఈ నృత్యంలో ముఖ్యంగ రాధా కృష్ణ పాత్రలు ప్రాముఖ్యం వహిస్తాయి. గోపికలూ, కృష్ణులూ నాట్య మాడి నిలబడి పోయి తరువాత వలయం మధ్యలో వున్న రాధాకృష్ణ పాత్ర ధారులు లిరువురూ నృత్యాన్ని ప్రారంభిస్తారు. వివిధ రకాల విన్యాసాలతో ఆ నృత్యం కనుల పండువుగా వుంటుంది. మధ్య మధ్య కృష్ణుని చేతిలోని మురళిని రాధ కొంటెగా లాగుకొని, తానే కృష్ణునిగా వేణువును వూదుతూ తానే కృష్ణుడుగా బావాభినయాన్ని చేస్తుంది. దీనిని లీలా నర్థన మంటారు. ఎనిమిది మంది గాని, పద్దెనిమిది మంది గానీ ఎందరున్నా సమసంఖ్యలో పాల్గొని మాత్రమే నృత్యం చేస్తారు. శిథిలమై పోతున్న ఈ కళా రూప సంప్రదాయాన్ని కాపాడటం ఎంతైనా అవసరం.

మూలాలు మార్చు

యితర లింకులు మార్చు