కారెం శివాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌గా ఏప్రిల్ 2016 నుండి నవంబరు 2019 వరకు పని చేశాడు.

కారెం శివాజీ
జననం (1978-12-25) 1978 డిసెంబరు 25 (వయసు 46)
జాతీయత భారతదేశం
వృత్తిఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌, దళిత ఉద్యమనేత , మాలమహానాడు వ్యవస్థాపకుడు & మాజీ అధ్యక్షుడు
జీవిత భాగస్వామిరాజేశ్వరి
పిల్లలురవితేజ, కిరణ్ మోహన్ , లక్ష్మి భవాని
తల్లిదండ్రులుకారం మోహనరావు , సరోజినీ

కారెం శివాజీ 1978 డిసెంబరు 25 న ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా లో కారం మోహనరావు , సరోజినీ దంపతులకు జన్మించాడు.

ఉద్యమాలు

మార్చు

కారెం శివాజీ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక దళిత ఉద్యమాల్లో పని చేశాడు. ఆయన సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో జేఏసీ నేతలతో కలిసి పని చేశాడు.[1][2]ఆయన 2009లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి మద్దతు తెలిపాడు.[3]

రాజకీయ జీవితం

మార్చు

మాల మహానాడు అధ్యక్షుడిగా ఉన్న కారెం శివాజీ, 2014 ఎన్నికల తర్వాత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరాడు. 2016 ఏప్రిల్ 13 న ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమితుడయ్యాడు.[4] కారెం శివాజీ 2019 నవంబరు 18 న తన పదవికి రాజీనామా చేసి, నవంబరు 29 న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[5]

మూలాలు

మార్చు
  1. "Bifurcation benefits Dalits". The Times of India. 2009-12-17. Archived from the original on 2012-09-15.
  2. 10TV (29 November 2019). "టీడీపీకి మరో షాక్ : వైసీపీలో చేరనున్న కారెం శివాజీ" (in telugu). Archived from the original on 24 September 2021. Retrieved 24 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. "Only PR can ensure social justice, says Karem Sivaji". The Hindu. Chennai, India. 2008-10-08. Archived from the original on 2008-10-11.
  4. Mana Telangana (13 April 2016). "ఆంధ్ర ప్రదేశ్ : ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ ఛైర్మన్‌గా కారెం శివాజీ." Archived from the original on 24 September 2021. Retrieved 24 September 2021.
  5. TV9 Telugu, TV9 Telugu (29 November 2019). "జగన్ చెప్పినట్టే.. తన పదవికి రాజీనామా చేసి.. పార్టీ మారిన కారెం..!". Archived from the original on 24 September 2021. Retrieved 24 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)