కార్టూనిస్ట్ పాప

పాప ఈనాడు పత్రికలో కార్టూన్లు గీసిన మొదటి తరం కార్టూనిస్ట్. "పాప" అన్న కుంచె పేరుతో కార్టూన్లు వేసిన ఇతడి అసలు పేరు శివరామరెడ్డి కొయ్య.

పాప, కార్టూనిస్ట్
శివరామరెడ్డి కొయ్య
జననంశివరామరెడ్డి కొయ్య
1944 ఆగస్ట్ 14
కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్‌
మరణం2022 జులై 23
హైదరాబాదు, తెలంగాణ
నివాస ప్రాంతంహైదరాబాదు
ఇతర పేర్లుశివరామరెడ్డి కొయ్య

జీవిత విశేషాలు. మార్చు

“పాప” పేరుతో కార్టూన్లు గీసిన ఈయన అసలుపేరు శివరామరెడ్డి కొయ్య. పుట్టింది ఆగస్ట్ 14న 1944 సంవత్సరం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో. ఫోర్త్ ఫారం చదివేటప్పుడు ఓ సిగరెట్ కంపెనీ వారి కేలండర్లో నటి బొమ్మను పెన్సిల్తో గీశాడు తొలిసారిగా. అది గమనించిన వీరి తండ్రి ఆర్ట్ మెటీరియల్ కొనిచ్చి ప్రోత్సహించారు. స్కూల్ ఫైనల్ చదివేటప్పుడే ఆంధ్రపత్రిక వారపత్రికలో మొదటికార్టూన్ అచ్చయ్యింది.

కార్టూనిస్టుగా మార్చు

కాలేజీ పూర్తయ్యాక విశాఖ టౌన్ ప్లానింగ్ సర్వేయర్ గా కొంత కాలం పనిచేసి, మధ్యలో కర్ణాటక లో ఫైన్ ఆర్ట్స్ కోర్సు చేసారు. తర్వాత హైదరాబాద్ ఎన్.జి.ఆర్.ఐ.లో ఆర్టిస్టుగా పనిచేశారు. 1973లో బాపు-రమణల సంపూర్ణ రామాయణం పుస్తక ఆవిష్కరణ సమయంలో కలిసినప్పుడు ‘మీరు కార్టూనిస్టుగా స్థిరపడితే మంచి భవిష్యత్ వుంటుందని’ బాపు సలహా ఇచ్చారట. 1975లో ఈనాడులో పొలిటికల్ కార్టూనిస్టుగా చేరాడు. ఈనాడు అత్యధిక సర్క్యులేషన్ గల పత్రిక అవుతున్న రోజులవి. ముఖ్యమంత్రి అంజయ్య మీదా, ఆయన జోకులమీదా, యాదగిరి మీదా పాప కార్టూన్లు సూపర్ హిట్లు కొట్టేవి. పాప అనగానే బొమ్మ హెలికాప్టర్ వెంటేసుకున్న అంజయ్య అందరికీ గుర్తొస్తారు. ఎనిమిదేళ్లు ఈనాడులో పనిచేశాక 1982లో ఆయన ఫ్రీలాన్సర్ అయ్యాడు. ఆంధ్రభూమి, సమయం, ఆంధ్రప్రభ పత్రికల్లో కార్టూన్లు గీశారు. మధ్యలో ఈ వారం వారపత్రిక నడిపారు. పాపా తన చిత్రాలతో హైదరాబాద్, విజయవాడలలో వన్మేన్ షోలు, గ్రూప్ షోలు నిర్వహించాడు.

అవార్డులు మార్చు

2002 హైదరాబాద్ లో ఏ.పి. ప్రెస్ అకాడెమి, ఫోరం ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్స్ ఆధ్వర్యంలో బాపుగారి చేతులమీదుగా సత్కారం.

మరణం మార్చు

77 ఏళ్ళ కొయ్య శివరామరెడ్డి అలియాస్‌ పాప అనారోగ్యంతో హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయన సర్జరీ విఫలం కావడంతో 2022 జులై 23న తుది శ్వాస విడిచారు.[1]

ఇతర లింకులు మార్చు