కార్తీకీ గోన్ సాల్వే స్

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుపొందిన ' ది ఎలిఫెంట్ విస్పర్స్ ' దర్శకురాలు కార్తీకీ గోన్ సాల్వే స్ కు మరో విశిష్ట గౌరవం దక్కింది[1]. ' ఎలిఫెంట్ ఫ్యామిలీ ' సంస్థ అందించే పర్యావరణ పురస్కారం తారా అవార్డును బ్రిటన్ రాజు మూడో చార్లెస్, రాణి కెమిలియాలు కార్తీకీకి ప్రధానం చేశారు[2]. కెమిలియా సోదరుడు మార్క్ షాండ్ 2003లో స్థాపించిన ఎలిఫెంట్ ఫ్యామిలీ ఆసియా ఏనుగులను అంతరించిపోయే ప్రమాదం నుంచి కాపాడడానికి, మానవులు, వన్యప్రాణుల మధ్య సహజీవనానికి తోడ్పడే ప్రాజెక్టులను చేపడుతోంది. షాండ్ పెంపుడు ఏనుగు తారా పేరు మీద ఈ అవార్డును ఏర్పాటు చేశారు. తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఏనుగులు, మానవుల సహజీవనం కోసం పాటుపడుతుంది, అక్కడ విరివిగా పెరిగే కలుపు మొక్క లాంటానా కామరాతో ఆదివాసీలు కోయ బొమ్మలు తయారుచేయడానికి సహాయం అందిస్తుంది. తిని ద్వారా పర్యావరణాన్ని కాపాడుతూనే ఆదివాసీలకు ఆదాయం కల్పిస్తుంది.

మూలాలు :

  1. "'Elephant Whisperers' Director Kartiki Gonsalves Gets Prestigious Tara Award From King Charles And Queen Camilla". NDTV.com. Retrieved 2023-08-31.
  2. "Environmental award for 'The Elephant Whisperers' director from King Charles". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-07-01. Retrieved 2023-08-31.