కాలాశోకుడు శిశునాగ వంశాన్ని స్థాపించిన శిశునాగుని కుమారుడు, ఈ వంశానికి చెందిన చివరిరాజు. హిందూ పురాణాలలో ఈయనను కాకవర్ణగా అభివర్ణించాయి. కానీ బౌద్ధ గ్రంథాలలో కాలాశోకునిగా ఉల్లేఖించబడినాడు.[1] మౌర్య చక్రవర్తి అశోకునితో వేర్చరచడానికి బౌద్ధ గ్రంథాలలో ఈయన శరీరఛాయ నల్లగా ఉన్నందువలన కాలాశోకుడన్నారు. అందుకే పురణాలు కూడా కాకవర్ణుడని (నల్లని రంగు వాడు) అభివర్ణించాయి.[2] కాలశోకుని పాలన రెండు విషయాలకై ప్రాముఖ్యత పొందినది. ఈయన పాలనాకాలంలోనే వైశాలిలో రెండవ బౌద్ధ సంగీతి జరిగినది, మగధ రాజధానిని రాజగృహ నుండి పాటలీపుత్రానికి తరలించబడినది.[3] శిశునాగ వంశం యొక్క అంతం గురించి స్పష్టంగా తెలియదు. మహాపద్మనందుడు ఇతడిని చంపి నందవంశాన్ని స్థాపించాడని భావిస్తారు.

మూలాలు

మార్చు
  1. Ancient Indian History and Civilization By Sailendra Nath Sen పేజీ.114 [1]
  2. Lectures on the Ancient History of India from 650 - 325 B. C. By D. R. Bhandarkar పేజీ.82 [2]
  3. Students' Britannica India By Dale Hoiberg, Indu Ramchandani పేజీ.370 [3]