కాలా (2021 సినిమా)
కాలా 2021లో మలయాళంలో విడుదలై.. తెలుగులోకి డబ్బింగ్ చేసిన సినిమా. అడ్వెంచర్స్ కంపెనీ బ్యానర్ పై టొవినో థామస్, దివ్య పిళ్ళై,లాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రోహిత్ విఎస్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 4 జూన్ 2021న ఆహా ఓటీటీలో విడుదలైంది.[2]
కాలా | |
---|---|
దర్శకత్వం | రోహిత్ విఎస్ |
రచన | యదు పుష్పాకారం రోహిత్ విఎస్ |
నిర్మాత | సిజు నావిస్ టొవినో థామస్ రోహిత్ విఎస్ అఖిల్ జార్జ్ |
తారాగణం | టొవినో థామస్ దివ్య పిళ్ళై లాల్ |
ఛాయాగ్రహణం | అఖిల్ జార్జ్ |
కూర్పు | చమన్ చక్కో |
సంగీతం | డాన్ విన్సెంట్ |
నిర్మాణ సంస్థ | జువిస్ ప్రొడక్షన్ |
పంపిణీదార్లు | సెంచరీ రిలీజ్ |
విడుదల తేదీ | 4 జూన్ 2021[1] |
సినిమా నిడివి | 130 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుషాజీ (టొవినో థామస్) తండ్రి (లాల్), తన కొడుకూ ఏదీ సవ్యంగా చేయడని ఆయన అనుకుంటాడు. షాజీ వ్యవసాయం చేయాలనుకుంటాడు. అయితే అందులో అప్పుల పాలవుతాడు. ఈ విషయంలో తండ్రి (లాల్)తో ఎప్పుడూ గొడవలే. వాళ్ల తోటలో పని చేయడానికి వేరే ఊరు నుంచి కొంతమంది పని మనుషులు వస్తారు. వాళ్లలో ఒకడు (సుమేష్ మూర్) సైకో. అతడి ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. తను ఆ ఇంటికి వచ్చింది పని చేయడానికి కాదు. ప్రతీకారం తీర్చుకోవడానికి. ఆ ప్రతీకారం ఏమిటి ? షాజీకీ ఆ సైకోకీ మధ్య ఏం జరిగింది? అనేదే మిగత కథ.[3][4]
నటీనటులు
మార్చు- టొవినో థామస్
- సుమేష్ మూర్
- దివ్యా పిళ్లై
- లాల్ పాల్
- ప్రమోద్ వెల్లియానంద్
సాంకేతిక నిపుణులు
మార్చు- దర్శకత్వం: రోహిత్ విఎస్
- నిర్మాతలు: సిజు
నావిస్
టొవినో థామస్
రోహిత్ విఎస్
అఖిల్ జార్జ్ - సంగీతం: డాన్ విన్సెంట్
- ఎడిటింగ్:చమన్ చక్కో
- కెమెరా:అఖిల్ జార్జ్
మూలాలు
మార్చు- ↑ Andhrajyothy (24 May 2021). "'ఆహా'లో టొవినో థామస్ 'కాలా'.. ఎప్పుడంటే?". www.andhrajyothy.com. Archived from the original on 13 జూన్ 2021. Retrieved 13 June 2021.
- ↑ NTV (24 May 2021). "ఆహాలో టొవినో థామస్ 'కాలా'". NTV. Archived from the original on 13 జూన్ 2021. Retrieved 13 June 2021.
- ↑ NTV (5 June 2021). "రివ్యూ: కాలా (మలయాళ డబ్బింగ్)". NTV. Archived from the original on 13 జూన్ 2021. Retrieved 13 June 2021.
- ↑ Sakshi (31 May 2021). "Kala: జంతువు కోసం మనిషి జంతువుగా మారితే!". Sakshi. Archived from the original on 13 జూన్ 2021. Retrieved 13 June 2021.