కాలి సిరలు
కాళ్ళలో బాహ్యసిరలు పాదం నుండి బయలుదేరుతాయి. పాదం పైభాగంలో విల్లు ఆకారంలో ఒక పక్కనుంచి రెండవ పక్కకు వ్యాపిస్తూ కనిపించే ఊర్ధ్వపాద సిరచాపం ( డోర్సల్ వీనస్ ఆర్చ్ ) మధ్యస్థంగా చీలమండ ఎముకకు ముందుగా కాలిపైకి [1] గరిష్ఠ దృశ్యసిర ( గ్రేట్ సెఫనిస్ వీన్ ) గా ఎగబ్రాకుతుంది. తొడ లోపలి భాగంలో యీ గరిష్ఠ దృశ్యసిర పయనించి తొడ పైభాగములో దృశ్యసిర రంధ్రం ద్వారా కండర ఆచ్ఛాదనము లోపలకు దూరి ఊరుసిరతో కలుస్తుంది.
ఊర్ధ్వపాద సిరచాపం పార్శ్వ భాగంలో చిటికెనవేలు పైభాగపు అంగుళిక సిరతో కలిసి కనిష్ఠ దృశ్యసిర ( లెస్సర్ సెఫినస్ వీన్ ) గా చీలమండలం పార్శ్వభాగపు ఎముకకు వెనుకగా పైకి ప్రాకి కాలు వెనుక భాగంలో పయనిస్తుంది. కాలి పైభాగంలో మోకాలు వెనుక ఈ సిర కండర ఆచ్ఛాదనం లోనికి చొచ్చి జానుసిరతో (పాప్లీటియల్ వీన్) కలుస్తుంది.
జానుసిర, ఊరుసిరగా ( ఫెమొరల్ వీన్ ) తొడలోపల పయనిస్తుంది.కటివలయములో ఊరుసిర బాహ్య శ్రోణిసిర ( ఎక్స్టెర్నల్ ఇలియక్ వీన్ ) గా సాగి , అంతర శ్రోణిసిరతో ( ఇంటర్నల్ ఇలియెక్ వీన్ ) కలసి శ్రోణిసిర అవుతుంది. వామ, దక్షిణ శ్రోణిసిరల సంధానం వలన అధోబృహత్సిర ఏర్పడుతుంది.
సిరలలో రకాలు
మార్చుబాహ్యసిరలు
మార్చుఇవి చర్మం క్రింద, కండర ఆచ్ఛాదనంకు పైన ఉంటాయి.
నిమ్నసిరలు
మార్చుఇవి కండర ఆచ్ఛాదంకు లోపల ఉంటాయి.
ఛిద్రసిరలు (పెర్ఫొరేటర్ వీన్స్; సంధానసిరలు)
మార్చుబాహ్యసిరలను, నిమ్నసిరలతో కలుపుతాయి. ఇవి కండర ఆచ్ఛాదంను చొచ్చుకొని లోపలకు ప్రవేశిస్తాయి. సాధారణ స్థితులలో రక్తము బాహ్యసిరలనుంచి నిమ్నసిరలలోనికి ఛిద్ర సిరల ద్వారా ప్రవహిస్తుంది. పీడన వ్యత్యాసం వలన దూరసిరల నుంచి నెత్తురు ముందుకు ప్రవహించి హృదయంలో కుడికర్ణికకు చేరుతుంది. కాళ్ళలో కండరాలు ముడుచుకొన్నపుడు నిమ్నసిరలపై ( డీప్ వీన్స్ ) ఒత్తిడి కలిగి రక్తం ముందుకు నెట్టబడుతుంది. సిరలలో కవాటాలు తిరోగమన ప్రవాహాన్ని నిరోధిస్తాయి. కండరాలు విరామస్థితికి చేరినపుడు నిమ్నసిరలలో పీడనం తగ్గి బాహ్యసిరలలోని రక్తం ఛిద్రసిరల ద్వారా నిమ్మసిరలలోనికి ప్రవహిస్తుంది. సిరలు సాగి, ఉబ్బి, మెలికలు తిరిగి ఉబ్బుసిరలుగా మారవచ్చు. ఉబ్బుసిరలను కాళ్ళలో సామాన్యంగా చూస్తాం.
మూలాలు
మార్చు- ↑ Caggiati, Alberto; Bergan, John J. (2002-01). "The saphenous vein: derivation of its name and its relevant anatomy". Journal of Vascular Surgery. 35 (1): 172–175. doi:10.1067/mva.2002.118826. ISSN 0741-5214. PMID 11802151.
{{cite journal}}
: Check date values in:|date=
(help)