ఏదైనా మతంలో, కాలజ్ఞానం లేదా భవిష్యవాణి (ఆంగ్లం: Prophecy) అనేది ప్రవక్తలు లేదా మహాత్ముల ద్వారా ఒక అతీంద్రియ శక్తి తెలియజేసే సందేశం. ఈ కాలజ్ఞానం అనేది అనేక సంస్కృతులు, మత విశ్వాసాల్లో భాగం. మతం, పురాణాలను బట్తి ప్రవక్తలకు దీని గురించిన సమాచారం దర్శనం, కొన్ని దైవిక కర్మలు లేదా మానవరూపంలో ఉన్న దైవపురుషలతో సంభాషించడం లాంటి పలు మార్గాల్లో తెలియవచ్చు. ఈ విధంగా చెప్పబడిన కాలజ్ఞానం కొన్ని శతాబ్దాలుగా మౌఖిక సాంప్రదాయం ద్వారానూ, ఆధ్యాత్మిక గ్రంథాల రూపంలోనూ మనుగడ సాగిస్తున్నాయి. హిందువుల సంస్కృతిలో కాలజ్ఞానం పేరుతో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఒక గ్రంథాన్ని రచించాడు.

20130315 123440 diety Sri Sri Sri Potuluri Veerabrahmam garu.jpg
కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

వివిధ మతాల్లో మార్చు

ఇస్లాంలో మార్చు

ఇస్లాంలో దీనిని నుబువా అంటారు. దేవుడు అందరికీ అర్థమయ్యే రీతిలో పంపిన సందేశం ఇది అని ముస్లిములు విశ్వసిస్తారు.[1][2]

వివరణ మార్చు

నాస్తికుల వివరణ ప్రకారం చాలా వరకు ముందే చెప్పినట్లుగా జరిగిన కాలజ్ఞానంలోని విషయాలు కేవలం కాకతాళీయంగా జరిగి ఉండవచ్చు లేదా ప్రవక్తలు చెప్పిన కొన్ని అస్పష్టమైన వివరాలు అయ్యుండవచ్చు లేదా ఒక విషయం జరిగిన తర్వాత దానికి తగినట్లుగా కాలజ్ఞానంలో మార్పులు చేసి ఉండవచ్చు.[3][4][5]

ఇవీ చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Campo, Juan Eduardo (2009). Encyclopedia of Islam. Infobase Publishing. pp. 559–560. ISBN 9780816054541. Retrieved 22 June 2015.
  2. ఖోరాన్ 30:47
  3. Hines, Terence. (2003). Pseudoscience and the Paranormal. Prometheus Books. pp. 66-73. ISBN 1-57392-979-4
  4. Pickover, Clifford A. (2001). Dreaming the Future: The Fantastic Story of Prediction. Prometheus Books. pp. 363-388. ISBN 1-57392-895-X
  5. Forshaw, Mark. (2012). Critical Thinking for Psychology. Wiley. pp. 46-48. ISBN 978-1-4051-9118-0