శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలైన అష్టమహిషులలో ఒకరు కాళింది. కాళింది సూర్యుని కూతురు. ఆమె విష్ణుమూర్తి అవతారమయిన శ్రీకృష్ణుడిని పెళ్ళి చేసుకోవాలని తపస్సు చేసింది. ఒకనాడు అర్జునుడితో కలిసి కృష్ణుడు యమునా నదిలో స్నానం చేయటానికి వెళ్ళినపుడు ఆమె తపస్సు గురించి తెలుసుకున్న అర్జునుడు శ్రీకృష్ణునితో తెలుపగా ఆమె మనోభిప్రాయానికి అనుగుణంగా ఆమెను ద్వారకా నగరానికి తీసుకెళ్ళి పెద్దలందరి సమక్షంలో ఆమెను వివాహం చేసుకుంటాడు.

వీరికి శ్రుతుడు, కవి, వృషుడు, వీరుడు, సుబాహుడు, భద్రుడు, శాంతి, దర్శుడు, పూర్ణమానుడు, శోమకుడు అనే కుమారులు జన్మించారు.

"https://te.wikipedia.org/w/index.php?title=కాళింది&oldid=2948991" నుండి వెలికితీశారు