కాళికాంబాల్ ఆలయం
కాళికాంబాల్ ఆలయం (తమిళం: காளிகாம்பாள் கோவில்) తమిళనాడులో చెన్నై నగరంలోని ప్యారీస్ కార్నర్ తంబుశెట్టి వీధిలో శ్రీ కాళికాంబాల్ (కామాక్షి), లార్డ్ కామదేశ్వరులకు అంకితం చేయబడిన సుప్రసిద్ధ దేవాలయం. రాజాజీ సలైకి సమాంతరంగా జార్జ్‌టౌన్‌లోని ప్రముఖ ఆర్థిక వీధి అయిన తంబు చెట్టి వీధిలో ఈ ఆలయం ఉంది.
కాళికాంబాళ్ ఆలయం | |
---|---|
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 13°05′40″N 80°17′21″E / 13.09455°N 80.2891°E |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తమిళనాడు |
జిల్లా | చెన్నై |
స్థలం | తంబు చెట్టి స్ట్రీట్, ప్యారీస్ కార్నర్ (పాత: జార్జ్ టౌన్), చెన్నై |
సంస్కృతి | |
దైవం | పార్వతి దేవి |
వాస్తుశైలి | |
నిర్మాణ శైలులు | హిందూ ఆలయ నిర్మాణం |
దేవాలయాల సంఖ్య | 1 |
చరిత్ర, నిర్వహణ | |
స్థాపితం | 1640 |
నిర్మించిన తేదీ | 1678 |
ఆలయ విశేషాలు
మార్చుకాళికాంబాల్ ఆలయం వాస్తవానికి ప్రస్తుత సెయింట్ జార్జ్ కోట ఉన్న ప్రదేశంలో సముద్ర తీరానికి దగ్గరగా ఉండేది.[1] బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కోటను నిర్మించినప్పుడు, ఆలయాన్ని 1640 మార్చి 1(CE)న ప్రస్తుత ప్రదేశానికి మార్చారు. ఈ నిర్మాణం 1678[2] వరకు కొనసాగింది.17వ శతాబ్దపు మరాఠా యోధుడు, రాజు, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ 1677న అక్టోబర్ 3న ఈ ఆలయాన్ని సందర్శించారు.[3][4] అంతకుముందు దేవి భీకర రూపంలో ఉండేదని ఆది శంకరుడు కామాక్షి దేవి శాంత స్వరూప (శాంత భంగిమ)లో ఆరాధన చేసారని భక్తుల విశ్వాసం. తమిళ కవి సుబ్రమణ్య భారతి 20వ శతాబ్దపు ప్రారంభంలో ఆలయాన్ని సందర్శించేవారు.[5] 1952లో ఆండవన్ పిచ్చి రచించిన ఉల్లం ఉరుగుతయ్య అనే తమిళ భక్తి గీతం ఆలయ ప్రాంగణంలో రూపొందించబడింది.[6]
1980వ దశకంలో 10 మీటర్ల ఎత్తైన రాజగోపురం నిర్మించబడింది. ఈ రాజగోపురం నిర్మాణం 1976 జనవరి 22న ప్రారంభమై 1983 జనవరి 21న పూర్తయింది.[7][8] 2014లో మరి కొంత ఆలయ విస్తరణ జరిగింది. కాళికాంబాల్ అమ్మవారిని కొట్టైఅమ్మన్, చెన్నమ్మన్ వంటి ఇతర పేర్లతో కూడా స్థానికులు కొలుస్తారు.[9]
వార్షిక బ్రహ్మోత్సవాలు 2022
మార్చు2022 జూన్ 3న కాళికాంబాల్ ఆలయంలో ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.[10] వీటిలో భాగంగా జూన్ 9న రథోత్సవం కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా మీనాక్షి అలంకరణతో కాళికాంబాల్ రథంపై కొలువుదీరారు.
మూలాలు
మార్చు- ↑ திருக்கோயில்கள் வழிகாட்டி: சென்னை மாவட்டம் (in తమిళము) (1st ed.). Chennai: Government of Tamil Nadu, Department of Hindu Religious and Charitable Endowments. July 2014. pp. 179–181.
- ↑ "1639 A.D. TO 1700 A.D." History of Chennai. ChennaiBest.com. Archived from the original on 2012-10-09. Retrieved 20 Jan 2013.
- ↑ "Chennai High: Where history beckons". The Times of India. Chennai. 27 August 2010. Archived from the original on 16 February 2013. Retrieved 20 Jan 2013.
- ↑ Muthiah, S. (2014). Madras Rediscovered. Chennai: EastWest. p. 384. ISBN 978-93-84030-28-5.
- ↑ Muthiah, S. (2014). Madras Rediscovered. Chennai: EastWest. p. 384. ISBN 978-93-84030-28-5.
- ↑ திருக்கோயில்கள் வழிகாட்டி: சென்னை மாவட்டம் (in తమిళము) (1st ed.). Chennai: Government of Tamil Nadu, Department of Hindu Religious and Charitable Endowments. July 2014. pp. 179–181.

- ↑ "వడపళని ఆలయంలో వైభవంగా రథోత్సవం - Andhrajyothy". web.archive.org. 2022-06-10. Archived from the original on 2022-06-10. Retrieved 2022-06-10.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)