కాళ్లకూరి నరసింహం పంతులు

కాళ్లకూరి నరసింహం పంతులు గారు మొదటి తరం గ్రంథాలయోధ్యములోని ప్రముఖులలో ఒకరు.

కాళ్లకూరి నరసింహం పంతులు

జననము మార్చు

గ్రంథాలయోధ్యమములో పాత్ర మార్చు

శ్రీ కాళ్లకూరి నరసింహం పంతులు గారు (1863 - 1926) పశ్చిమ గోదావరి జిల్లా కొంపల్లె నివాసి. గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య వారు గ్రంథాలయ ఉద్యమములో ప్రవేశింపక పూర్వమే కాళ్లకూరి వారు భారత జాతీయ కాంగ్రెస్ నాయకులైన హూం, దాదాభాయి నౌరోజీ, అనిబిసెంట్ వంటి వారి పేర్లతో గ్రామలలో 1900 కు పూర్వమే గ్రంథాలయాలను స్థాపించి గ్రామీణులలో సామాజిక సృహ నెలకొల్పారు. అయ్యంకి వారితో పరిచయము ఏర్పడ్డాక తన కార్య క్రమాల పరిదిని మరింత విస్తరించారు. భీమవరము ప్రాంతములో అనేక మంది గ్రంథాలయా కార్య కర్తలను తయారు చేశారు. జిల్లా స్థాయి గ్రంథాలయ సభలను, సమావేశాలను నిర్వహించి గ్రంథాలయాల ప్రాముఖ్యతను వివరించారు. వీరి కృషికి గుర్తింపుగా వీరిని గ్రంథాలయ భీష్మ అని పిలిచేవారు. 90 సంవత్సరాల క్రితం వీరు స్థాపించిన గ్రంథాలయాలు ఈ నాటికి ప్రజలకు సేవలందిస్తున్నాయి.

మూలాలు మార్చు

గ్రంథాలయోధ్యమ శిల్పి అయ్యంకి అనుగ్రంథము: పుట.