కాశీ విశ్వనాథుని నడవా

కాశీ విశ్వనాథుని నడవా (ఆంగ్లం: Kashi Vishwanath Corridor) కాశీ సుందరీకరణ పనులు, గంగా నదిని అనుసంధానిస్తూ ఈ నడవాను నిర్మించారు. నిర్మాణంలో పలు విశేషాలతో పాటూ యాత్రికుల సందర్శనా అనుభవాన్ని పూర్తిగా మార్చేందుకు దీనిని అభివృద్ధి చేశారు.[1]

గతంలో కాశీ విశ్వనాథ ఆలయ వీధి, వారణాసి

2019లో కాశీవిశ్వనాథ ఆలయం, గంగా నది మధ్య యాక్సెస్‌ను సులభతరం చేయడానికి కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్ రూపొందించబడింది. రద్దీని నివారించడానికి విస్తృత స్థలాన్ని సృష్టించారు. దీనికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం ఆలయ వైశాల్యాన్ని దాదాపు 50,000 చదరపు మీటర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు 1,400 మంది నివాసితులు, వ్యాపారాలు వేరే చోటికి మార్చబడ్డారు. 40కి పైగా శిధిలమైన దేవాలయాలు కనుగొనబడ్డాయి. అవి పునర్నిర్మించబడ్డాయి. యాత్రికుల సౌకర్యార్థం మొత్తం 23 కొత్త భవనాలు నిర్మించారు. 13 డిసెంబరు 2021న నరేంద్ర మోదీ కాశీ విశ్వనాథుని నడవాను ప్రారంభించారు.[2]

మూలాలు

మార్చు
  1. "Kashi Vishwanath Corridor: కాశీ విశ్వనాథుని నడవా విశేషాలివి..!". EENADU. Retrieved 2021-12-14.
  2. "Kashi Vishwanath Corridor Inauguration Highlights: PM inaugurates Kashi Vishwanath corridor, says 'virasat and vikas' in New India". The Financial Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-12-13. Retrieved 2021-12-14.