కాస్మికామిక్స్

కథల పుస్తకం


కాస్మికామిక్స్ ఇటాలో కాల్వినో రచించిన కథల పుస్తకం. ఇది ఇటాలియన్ భాషలో మొదటిసారిగా 1965లోను, ఇంగ్లీషులో 1968లోను ప్రచురితమైంది. ప్రతి కథా ఒక శాస్త్రీయ వాస్తవికాంశాన్ని (కొన్ని ఇప్పుడు అబద్ధాలని తెల్సినా) తీసుకొని, దాని చుట్టూ ఊహాత్మక కథ అల్లుకొని ఉంటుంది. ఎప్పటికీ సజీవుడై, Qfwfqగా పిలవబడే ఒకడు, ఈ కథలు చెప్పుకొస్తాడు, ఒక రెండు కథలు తప్పించి. ఆ రెండు కథలూ, విశ్వం యొక్క చరిత్రలో జరిగిన సంఘటనలను గుర్తు తెచ్చుకోవడం. కాల్వినో మరో రచన t zeroలో కూడా Qfwfq కథలు చెప్పుకొస్తాడు.

Cosmicomics
File:Cosmicomiche.jpg
కృతికర్త: ఇటాలో కాల్వినో
అసలు పేరు (తెలుగులో లేకపోతే): Le Cosmicomiche
అనువాదకులు: విలియం వీవర్
ముఖచిత్ర కళాకారుడు: M. C. Escher (depicted)
ఎ. సిమి(first paper)[a]
దేశం: ఇటలీ (first)
భాష: ఇటాలియన్1(first)
విభాగం (కళా ప్రక్రియ): Science fiction కథలు
ప్రచురణ: Giulio Einaudi (ఇటాలియన్)
Harcourt Brace (US)
విడుదల: 1965
ఆంగ్ల ప్రచురణ: 1968 (US, UK)
ప్రచురణ మాధ్యమం: Print (hardcover & paperback (1970))[1]
పేజీలు: 188 pp (first)
153 pp (US, UK)
185 pp (first paper)
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 0-15-622600-6 (1976 US)[1]
OCLC: 2521577

“కాస్మికామిక్స్”లో అన్ని కథలూ, “t zero”లోని కథలూ, మరి కొన్ని కథలూ అన్నీ కలిపి ఇప్పుడు ఒకటే సంపుటిలో, The Complete Cosmicomics (Penguin UK, 2009), లభిస్తున్నాయి.

విలియం వీవర్ అనువదించిన మొదటి యూ.ఎస్ ఎడిషన్‍, నేషనల్ బుక్ అవార్డును Translation category.[2]లో అందుకుంది.


విషయసూచిక

మార్చు
 • The Distance of the Moon— మొదటి కథ. బాగా ప్రాచుర్యం పొందిన కథ. కాల్వినో, చంద్రుడు భూమికి దగ్గరగా ఉండేవాడనే నిజాన్ని తీసుకొని, మనుషుల మధ్య ప్రేమ త్రికోణాన్ని చూపిస్తూ కథను అల్లాడు. ఇందులో మనుషులు దూకేంత చేరువలో చంద్రుడు ఉంటాడు. చంద్రుడు దూరం అవ్వడంతో ప్రేమికులూ విడిపోతారు.
 • At Daybreak — పదార్థం ఘనీభవించక ముందురి జీవితం.
 • A Sign in Space — నక్షత్ర మండలం గుండ్రంగా తిరుగుతుందని గ్రహించిన ఒకడు, శాశ్వతంగా తన అస్థిత్వపు జాడలు వదలాలని ప్రయాసపడతాడు. ఈ కథలో పోస్టుమాడరన్ థియరీలో ఒకానొక సిద్ధాంతాన్ని గమనించవచ్చు — ఒకదాని సంతకం దాని ప్రత్యేకతను చాటలేదు, అలా అని, దేనినైనా పూర్తిగా, విశిదీకరంగా వివరించాలంటే పదాలు లేక సంకేతాలు సరిపోవు.
 • All at One Point — పదార్థమూ, సృష్టి ఒకటే బిందువులో ఉందనే వాస్తవికాంశం ఆధారంగా తీసుకున్న కథ.

"Naturally, we were all there—old Qfwfq said—where else could we have been? Nobody knew then that there could be space. Or time either: what use did we have for time, packed in there like sardines?"

 • Without Colors — వాతావరణం ఏర్పడకముందు అంతా బూడిద రంగులో కనిపించేది. వాతావరణం ఏర్పడేసరికి, రంగులూ కనిపించాయి. ఈ కొత్తదనం Qfwfq ప్రేమికురాలిని భయపెడుతుంది.
 • Games Without End — నక్షత్రమండలపు గోళీల ఆట, విశ్వంలో ఇంకా నిపాతాలు ఏర్పడక ముందు.
 • The Aquatic Uncle — పరిణామక్రమంలో ఒక దశలో జంతువులన్నీ సముద్రాన్ని వదిలేసి, నేలపైకి వచ్చి జీవించడం మొదలెడతాయి. ఒక కుటుంబం, “నాగరికత” నేర్చుకున్న తమలాగ నేలపైకొచ్చి ఉండకుండా, ఇంకా నీళ్ళల్లోనే ఉంటున్న ఒక ముసలి చుట్టం గురించి సిగ్గుపడ్డం అనేది ఇందులో కథాంశం.
 • How Much Shall We Bet — మానవ పరిణామక్రమం ఎంతదూరం వెళ్తుందోనని పందేలు వేసుకునే కథ.
 • The Dinosaurs — డైనాసోర్లన్నీ అంతరించిపోయాక, ఒకానొక డైనాసర్ బతికిపోతుంది. అలా చిట్టచివరి డైనాసర్‍గా జీవించటం ఎలా ఉంటుందో, చుట్టూ ఉన్న పాలిచ్చే జంతువులు దీన్ని రాక్షసిగా చూస్తుంటే ఏమనిపిస్తుందోనన్న కథాంశంతో చెప్పిన కథ.
 • The Form of Space — పేరులేని ఒక కథకుడు,అంతరిక్షంలో "కిందకు పడిపోతాడు". అలా పడిపోతున్నప్పుడు తన ఎదురుగా ఓ అందమైన యువతి ఉర్సులా హెచ్’ఎక్స్, కూడా అలానే పడుతుందని గ్రహిస్తాడు. అలానే, ఆమెను ప్రేమిస్తున్న లెఫ్టనెన్ట్ ఫెనిమోర్ కూడా. తాను ఉర్సులాను తాకేలాగా అంతరిక్షం తన రూపాన్ని మారిస్తే కథకుడు కలలు కంటాడు.
 • The Light Years — పేరులేని ఒక కథకుడు, వేరే నక్షత్రమండలాల వైపు చూస్తుండగా, “నిన్ను చూశాను” అనే సంకేతం కనిపిస్తుంది. 100,000,000 కాంతి సంవత్సరాల దూరం ఉన్న ఆ మండలాల మధ్య, తానేం చేస్తుందని ఎలా తెల్సిందోనని ఆందోళన పడుతూ తన డైరీని తిరగేస్తాడు, ఆ రోజు తానేం చేశాడోనని. ఎవరికి తెలియకూడని పని అని అర్థం అవుతుంది. గాభరా పడతాడు.
 • The Spiral — మృదుశరీరప్రాణి జీవితం ఆధారంగా కథ. ప్రేమనూ, రచనా వ్యాసంగాన్ని కూడా చర్చిస్తుంది.

అన్ని కథలలోనూ మానవేతర పాత్రలు ఉంటాయి. వాటికి భారీగా మానవ రూపాన్ని ఆపాదించటం జరుగుతుంది.

పాద పీఠి

మార్చు
 1. ISFDB lists Escher for the first edition and one US paperback edition, probably 1976; no data for the first US and UK editions; A. Simi for the first paperback edition (1970, US).

రెఫరెన్సులు

మార్చు
 1. 1.0 1.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; isfdb అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 2. "National Book Awards – 1969". National Book Foundation. Retrieved 2012-03-11.
  There was a "Translation" award from 1967 to 1983.
 • Tuck, Donald H. (1974). The Encyclopedia of Science Fiction and Fantasy. Chicago: Advent. pp. 86. ISBN 0-911682-20-1.

బయటి లింకులు

మార్చు

Italo Calvino at the Internet Speculative Fiction Database