కిచిడీ సంప్రదాయ భారతీయ వంటకం. సాధారణంగా దీన్ని బియ్యం, పప్పుతో తయారు చేస్తారు. కిచిడీ తయారు చేయడం చాలా సులభం మాత్రమే కాదు, పౌష్టిక ఆహారం, ఎంతో బలవర్ధకమైనది. [1] ఇది ప్రధాన ఆదరువుగా ప్రక్కన కొబ్బరి పచ్చడి, బూందీ పెరుగు పచ్చడి వాటితో ఫలహారంగా తీసుకుంటారు.

కిచిడీ
Khichuri-edit.jpg
Khichdi
మూలము
ఇతర పేర్లుKhichri, Khichadi, Khichdee, Khichadi, Khichuri (Bengali), Khisiri (Assamese), Khechidi (Odia), Kisuri (Sylheti), Khichari, Kitcheree, Kitchree
మూలస్థానంIndian Subcontinent
ప్రదేశం లేదా రాష్ట్రంBangladesh, India, Pakistan, Nepal
వంటకం వివరాలు
ప్రధానపదార్థాలు Rice, lentils, spices
అరటి ఆకు సంప్రదాయ గిన్నెలో కిచిడీ ప్రసాదం, ఇస్కాన్ బెంగుళూరు.

వివిధ రకములు మార్చు

ఈ క్రింద సూచించిన కొన్ని కిచిడీలు వివిధ రకములుగా తయారు చేసుకుంటారు.

  1. పెసర పప్పు, బియ్యం, కూరగాయ ముక్కలు, అల్లం పచ్చి మిర్చి కలిపి చేసిన కిచిడి. దీనికి కొబ్బరి పచ్చడి, బూందీ పెరుగు పచ్చడి తినడానికి తోడు వంటకాలు. [2]
  2. సేమ్యా కిచిడీ
  3. గోదుమ రవ్వ కిచిడీ
  4. వెజిటబుల్ పాలక్ కిచిడీ
  5. గోధుమరవ్వ, పాలకూర కిచిడీ
  6. గోధుమరవ్వ, ఎర్రపప్పు కిచిడీ
  7. జొన్నరవ్వ, పెసర పప్పు కిచిడీ
  8. సగ్గుబియ్యం కిచిడీ

గోదుమ రవ్వ కిచిడి మార్చు

 
Khichuri, Bengali style dish

తయారుచేయు విధానం మార్చు

మొదటి రకం మార్చు

గ్యాస్ స్టవ్ వెలిగించి, దానిమీద ఒక బేసిన్‌ పెట్టి అందులో చేయబోయే పదార్ధానికి సరిపడా (2-4 చెంచాలు) నూనె వేసి, నూనె వేడెక్కాక మినప పప్పు, పచ్చి శనగ పప్పు, ఎండు మిర్చి ముక్కలు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేగాక సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, (కావాలనుకునే వారు వెల్లులి పాయ ముక్కలు వేసుకోవచ్చు) టమాటా ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, బీన్సు ముక్కలు, జీడిపప్పు, కొత్తిమీర (కావాలనుకునేవారు పుదీనా కూడా వేసుకోవచ్చును) అన్నీ వేసి తక్కువ మంటలో బాగా కలిపి వేయించు కోవాలి. తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న ఒక కప్పు గోదుమ రవ్వ, ఒక కప్పు పెసర పప్పు వేసి తగినంత ఉప్పు వేసి, దీనికి నాలుగున్నర కప్పులుగా నీళ్ళు పోసి మూత పెట్టుకోవాలి. సన్నని సెగ మీద ఉడికించుకోవాలి. పదార్థం బాగా ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసి, కాసేపు అలాగే ఉంచి మగ్గనివ్వాలి. కొద్దిగా వేడి తగ్గాక ఒక పళ్ళెంలో వడ్డించుకొని, దీనికి రైతా లేదా కొబ్బరి పచ్చడితో తింటే చాలా బావుంటుంది.

రెండవ రకం మార్చు

  • కావల్సిన పదార్థాలు : టొమాటోలు 2, క్యాప్సికం 2, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 4, అల్లం చిన్నముక్క, అరకట్ట పుదీనా, ఆరకట్ట మెంతి కూర, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, 1 నిమ్మ కాయ, ఉప్పు సరిపడ, పసుపు పావు టీ స్పూను.
  • గోధుమ నూక 1 1/2 కప్పులు, నీళ్ళు 6 గ్లాసులు, చాయ పెసర పప్పు రెండు గుప్పెళ్ళు, నూనె, పచ్చి బఠాణీలు.
  • గ్యాస్ స్టవ్ వెలిగించి, దానిమీద ఒక బేసిన్‌ పెట్టి, నూనె వేడి చేసి, శనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి వేగాక పచ్చి మిర్చి, అల్లం, కూరగాయ ముక్కలు, కరివేపాకు అన్నీ వేసి వేగనిచ్చి, ఉప్పు, పసుపు, నీళ్ళు, పెసర పప్పు, గోధుమ నూక వేసి కలిపి మూత పెట్టి కాస్త ఉడికాక, స్టౌ తగ్గించి కాసేపు అయ్యాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి. రెండు నిమిషాల తర్వాత, మూత తీసి కొత్తిమీర చల్లితే వేడి వేడి కిచిడీ రెడీ. ఆరోగ్యానికి కూడా మంచిది.

సగ్గుబియ్యం కిచిడీ మార్చు

 
హిందువులచే ఉపవాస సమయంలో సగ్గుబియ్యం కిచిడీ ఉపయోగించబడుతుంది

ముందుగా ఎక్కువగా నీళ్ళు పోయకుండా సగ్గుబియ్యాన్ని ఒక గంట నానబెట్టాలి. గ్యాస్ స్టవ్ వెలిగించి, దానిమీద ఒక బేసిన్‌ పెట్టి, నూనె వేడి చేసి, తరువాత పోపువేసి పచ్చిమిర్చి ముక్కలు బంగాళాదుంప ముక్కలు వేసి వేయించి, తరువాత కొంచం ఉప్పువేసి మూతపెట్టాలి. బంగాళాదుంప ముక్కలు ఉడకగానే నానబెట్టిన సగ్గుబియ్యం వేసి కలిపి మూతపెట్టాలి. ఒక పది నిమిషాలు స్టవ్ సిమ్‌లో ఉంచి, ఉడికించిన తరువాత అందులో వేయించి పొడి చేసుకున్న వేరుశనగపప్పు పొడి ఒక సగం కప్పు వేసి కలపాలి. చివరికి ఇష్టం ఉంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. సగ్గుబియ్యం కిచిడీ తినడానికి సిద్ధమవుతుంది.

తయారీ విధానం : టమాటో. 250 గ్రా. పచ్చిమిర్చి రుచికి తగిన విధంగా తీసుకోవాలి. క్యారట్ మూడు, బంగాళాదుంపలు 2 ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టాలి. గ్యాస్ స్టవ్ వెలిగించి, దానిమీద ఒక బేసిన్‌ పెట్టి, నూనె వేడి చేసి, తాలింపు వేసి, కరివేపాకు వేసి, కూరగాయ ముక్కలని తాలింపులో వేసి మగ్గించాలి. ఈ లోపు బియ్యం. కందిపప్పు. కడిగి నానబెట్టుకోవాలి. కూరగాయ ముక్కలన్ని మగ్గాక 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీహిందువులచే ఉపవాస సమయంలో ఉపయోగించబడుతుందిళ్ళు పోసి ఉడికించాలి. ఎసరు ఉడికేటప్పుడు నాన పెట్టిన బియ్యం, కంది పప్పు ఎసరులో వేసి, సరిపడా ఉప్పు కూడా వేసి సిమ్‌లో 15 నిమిషాలు ఉడికించాలి. చివరిగా కొత్తిమీర వేసి దించాలి. దీనికి ఆవకాయ లేదా వేరుశనగపప్పుల చట్నీ మంచి కాంబినేషన్ అనుకోవచ్చు.

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-08-19. Retrieved 2018-05-08.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-06-07. Retrieved 2018-05-09.
"https://te.wikipedia.org/w/index.php?title=కిచిడీ&oldid=2969693" నుండి వెలికితీశారు