కిల్లింగ్ వీరప్పన్
వాస్తవిక సంఘటనల ఆధారంగా తెలుగు, కన్నడ భాషలలో నిర్మించబడిన కిల్లింగ్ వీరప్పన్ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ దర్శకుడు.
కిల్లింగ్ వీరప్పన్ | |
---|---|
దర్శకత్వం | రామ్ గోపాల్ వర్మ |
రచన | రామ్ గోపాల్ వర్మ |
నిర్మాత | ఇ.శివప్రకాశ్ బి.వి.మంజునాథ బి.ఎస్.సుధీంద్ర |
తారాగణం | శివరాజ్‌కుమార్ సందీప్ భరద్వాజ్ 'రాక్‌లైన్' వెంకటేశ్ పారుల్ యాదవ్ యాజ్ఞాశెట్టి |
ఛాయాగ్రహణం | ర్యామి |
కూర్పు | అన్వర్ అలీ |
సంగీతం | శాండీ |
విడుదల తేదీ | 07 జనవరి 2016 [1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
చిత్ర కథ
మార్చుగంధపుచెక్కల స్మగ్లర్ వీరప్పన్ ఆచూకీ తెలిసి అతడిని చంపడానికి పోలీస్ ఆఫీసర్ బయలుదేరడంతో కథ ప్రారంభమౌతుంది. వీరప్పన్, అతని సహచరులు మాటువేసి ఆ ఆఫీసర్ బృందాన్ని చంపివేస్తారు. అప్పటికే పలువురు ఉన్నతాధికారులను పోగొట్టుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ నుంచి హీరో విజయకుమార్ రంగంలోకి దిగుతాడు. శ్రియ అనే అమ్మాయి ద్వారా వీరప్పన్ భార్య ముత్తులక్ష్మిని నమ్మించి వీరప్పన్‌ను పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. ఈ ప్లాన్ వీరప్పన్‌కు తెలిసిపోవడంతో ఆ ప్రయత్నం కాస్తా విఫలమౌతుంది. ఆ తర్వాత ఎన్నెన్ని పథకాలు వేసి ఆ పోలీసు అధికారి వీరప్పన్‌ను మట్టుపెట్టాడన్నది మిగతా సినిమా.[2]
తారాగణం
మార్చు- సందీప్ భరద్వాజ్ - వీరప్పన్
- శివరాజ్‌కుమార్ - విజయకుమార్ (హీరో)
- రాక్‌లైన్ వెంకటేశ్ - పోలీస్ అధికారి
- యాజ్ఞాశెట్టి - ముత్తులక్ష్మి (వీరప్పన్ భార్య)
- పారుల్ యాదవ్ - శ్రియ (హీరోయిన్)
సాంకేతికవర్గం
మార్చు- రచన : కె.బాలాజీ
- మాటలు : శశాంక్ వెన్నెలకంటి
- పాటలు : సిరాశ్రీ
- నేపథ్య సంగీతం : శ్యాండీ
- కెమెరా: ర్యామి
- యాక్షన్ : అలెన్ అమీన్
- ఎడిటింగ్: అన్వర్ అలీ
- నిర్మాతలు: ఇ.శివప్రకాశ్, బి.వి.మంజునాథ, బి.ఎస్.సుధీంద్ర
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
మూలాలు
మార్చు- ↑ Sakshi (2 January 2016). "తెలుగులో 7న వస్తున్నవీరప్పన్". Archived from the original on 31 ఆగస్టు 2021. Retrieved 31 August 2021.
- ↑ "చిత్ర సమీక్ష - రెంటాల జయదేవ". Archived from the original on 2016-01-10. Retrieved 2016-01-14.