కుంపటి
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
కుంపటి: మట్టితో గాని, ఇనుప రేకులతో గాని చేసిన పొయ్యిని కుంపటి అంటారు. మామూలు పొయ్యి అయితే అది వున్న చోటునే వంట చేసుకోవాలి. కాని కుంపటి మన ఇస్టమున్న చోటున పెట్టుకొని వంట చేసు కోవచ్చు. దీని వల్ల వంట చెరకు కొంత ఆదా అవుతుంది. ఇది చాల పురాతనమైనదే. కుంపటి మీద ఒక సామెత కూడ వున్నది. "ఒక ముసలమ్మ తన కుంపటి.. కోడి లేకుంటే వూర్లో తెల్లవారదని ఆ వూరి మీద పగ తీర్చు కోడానికి తన కుంపటిని, కోడిని తీసుకొని వెళ్లి పోయిందట" ఆ వూర్లో ఎవ్వరికి కోడి లేనందున తన కోడి కూయంగానె తెల్లవారేది. ఆ తర్వాత తన కుంపటి రాజేయగా..... ఇరుగుపొరుగు వారు వచ్చి నిప్పు తీసుకెళ్లి తమ ఇళ్లల్లో పొయ్యి రాజేసుకునె వారు.
కుంపటికి సంబందించిన సామెత.....
ఒక అవ్వ .... తన కుంపటి... తన కోడి లేకుంటే ఈ ఊర్లో తెల్లవారదని తలచి తన కోడిని - కుంపటిని తీసుకొని వేరే వూరికి వెళ్ళిపోయిందట.
వివరణ: ఒక అవ్వ వద్ద ఒక కోడిపుంజు వుండేది. అది తెల్లవార జామున కూత వేసేది. దాంతో ఆ వూరి జనము నిద్ర మేల్కొని మగ వారు పొలాలకు వెళ్ళగా.... ఆడవారు ఈ అవ్వ ఇంటికొచ్చి కుంపటి లోని నిప్పును తీసుకెళ్ళి తమ ఇళ్ళలో పొయ్యి రాజేసుకునేవారు. ఇలా జరుగు చుండగా....... అవ్వకు ఒక ఆలోచన వచ్చింది. అదేమంటే....... ఈ వూరి వారందరు తన కోడి కూతతో మేల్కొని తమ పనులను పోతున్నారు, తెల్లవారుతున్నది..... ఆడవారు తన కుంపటి లోని నిప్పును తీసుకెళ్ళి తమ ఇండ్లలో పొయ్యిని రాజేసుకొని వంట చేసుకుంటున్నారు . తన కోడి -- కుంపటి తోనే ఈ ఊరిలో తెల్లవారుతున్నది...... వంటలు చేసుకుంటున్నారు, తాను, తన కోడి, కుంపటి లేకుంటే ఈ వూరిలో ఎలా తెల్లవారుతుంది.... స్త్రీలు వంటలెలా చేసుకుంటారు, పనులు ఎలా జరుగుతాయి..... చూడాలనుకొని తన కుంపటిని, కోడిని తీసుకొని వేరే పల్లెకు వెళ్ళి పోయిందట. అయినా తన కోడి - కుంపటి లేకున్నా ఆ వూరిలో జన జీవనము యధావిధిగా జరుగుతుండడము చూచి ఆ అవ్వ నివ్వెర పోయిందట.