కుట్లదంపట్టి జలపాతం
కుట్లదంపట్టి జలపాతం తమిళనాడు రాష్ట్రంలో మధురై జిల్లాల వడిపట్టి సమీపంలోని కుట్లదంపట్టి గ్రామంలో ఉంది.[1]
కుట్లదంపట్టి జలపాతం | |
---|---|
ప్రదేశం | 30 km NW of Madurai |
అక్షాంశరేఖాంశాలు | 10°08′01″N 78°01′03″E / 10.133704°N 78.017392°E |
రకం | జలపాతాలు |
మొత్తం ఎత్తు | 90 అ. (27 మీ.) |
బిందువుల సంఖ్య | 2 |
పర్యాటకం
మార్చుఈ ప్రాంతానికి పర్యాటకులు సెప్టెంబరు నుంచి ఫిబ్రవరి వరకు సందర్శనకు వస్తారు. ఈ ప్రాంత అభివృద్ధి 2000 వ సంవత్సరం నుంచి జరిగింది. పేవ్మెంట్ నిర్మాణం, జలపాతానికి దారితీసే దశలను స్థానిక పరిపాలన సంబంధించిన అభివృదిని చేపట్టింది. ఈ జలపాతానికి చాలా మంది తమ వారాంతాలను ఇక్కడికి సరదాగా గడుపుతారు. వేసవిలో లేదా వర్షం లేనప్పుడు జలపాతం ఎండిపోతుంది. ఈ జలపాతానికి చేరువలో స్వామి రామనగిరి ఆశ్రమం ఉంటుంది. ఈ ఆశ్రమం మామిడి పొలాల చుట్టూ ఉంటుంది. ఈ ఆశ్రమంలో వివిధ మందిరాలు కూడా ఉన్నాయి ఇవి ధ్యానం, ఆధ్యాత్మిక ఉపశమనం కోసం ఒక మంచి ప్రదేశంగా ఉంది. ఈ జలపాతాలను పర్యాటక కేంద్రంగా ప్రోత్సహించడానికి, ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించడానికి, ట్రెక్కింగ్ చేసేవారి సౌలభ్యం కోసం పర్యాటక శాఖ, తమిళనాడు ప్రభుత్వం సహకారంతో రెండు కిలోమీటర్ల ట్రెక్ నిర్మాణంతో సహా అనేక చర్యలు తీసుకుంది.[2]
మరిన్ని విశేషాలు
మార్చుఈ జలపాతం తమిళనాడు అటవీ శాఖచే నిర్వహించబడుతున్న రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంది. ఈ నీరు సుమారు 27 మీటర్ల ఎత్తు నుండి వస్తుంది.
మూలాలు
మార్చు- ↑ "Tourism, Madurai's mainstay". The Hindu. January 20, 2003. Archived from the original on 2009-11-13. Retrieved 2019-11-05.
- ↑ "The sound and the fury". The Hindu. December 17, 2005. Archived from the original on 2007-10-17. Retrieved 2019-11-05.