తొలి తెలుగు రామాయణ కర్త అయిన గోన బుద్దారెడ్డి సోదరి కుప్పాంబిక మల్యాల గుండనాథుని భార్య. ఈమె తొలి తెలుగు కవయిత్రిగా గుర్తింపు పొందినది. తన భర్త మల్యాల గుండనాథుడు మరణించిన తర్వాత బూదపురం (నేటి భూత్పూరు)లో క్రీ.శ.1276లో ఒక శాసనం వేయించింది.[1] ఈమె రచనలు కాని, వాటిపేర్లు కాని లభ్యం కాలేవు. అయిననూ అయ్యలరాజు తన సంకలన గ్రంథంలో కుప్పాంబిక పద్యాలను ఉదహరించాడు.

మూలాలుసవరించు

  1. పాలమూరు సాహితీ వైభవం, ఆచార్య ఎస్వీ రామారావు, 2010 ప్రచురణ, పేజీ 13