కుమార శతకమును పక్కి వేంకట నరసింహ కవీంద్రుడు రచించాడు. 16వ శతాబ్దం మధ్యకాలంలో ముద్రింపబడినప్పటినుంచి తెలుగు నాట విస్తృతంగా ప్రచారం పొందిన శతకాలలో కుమార, కుమారీ శతకాలు కూడా ఉన్నాయి. కుమార శతకం చివర కవి పేరు ఏమీ లేకపోయినా ఆయనే వ్రాసిన కుమారీ శతకం చివర గల

ధరబ్రక్కి కులుడు వేంకట
నరసింహకవీంద్రుడిట్టి నడతలుధరపై
దెఱవల తెఱవులటంచును
జిరతరసత్కీర్తి వెలయజెప్పె కుమారీ

అని చెప్పిన దానిని బట్టి కవి పేరు తెలుస్తున్నది.

ఈ కవికి అప్పల నరసయ్య అనే ఉపనామం కూడా ఉన్నది. ఈ కుమారి శతకం రౌద్రినామ సంవత్సరం పుష్యమాసంలో అంటే 1860 వ సంవత్సరంలో వ్రాసినట్లుగా నరసింహ కవే తెలిపాడు. కవి స్వయంగా 'పక్కికులోద్భవుడు అప్పలనరసింహుడు అని తనను గురించి తెలుపుకొన్నాడు.

కొన్ని పద్యాలు మార్చు

వగవకు గడిచిన దానికి
బొగడకు దుర్మతులనెపుడు పొసగని పనికై
యేగి దీనత నొందకుమీ
తగదైవగతిం బొసంగు ధరను కుమారా!

అర్ధం: ఓ కుమారా! అయిపోయిన పని గురించి చింతింపవద్దు. దుష్టులను మెచ్చుకొనవద్దు. నీకు సాధ్యము కాని దానిని పొందలేక పోతినని చింతిచుట పనికిరదు. భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి చెందుము.

ధరణీనాయకు రాణియు
గురురాణియు నన్నరాణి కులకాంతను గ
న్నరమణి దను గన్నదియును
ధర నేవురు గల్లులనుచు దలపు కుమారా!

అర్ధం: ఓ కుమారా! రాజు భార్యయును, గురు భార్యయును, అన్న భార్యయును, అత్తయును, ఈ ఐదుగురు తల్లులని భావింపవలెను.

మూలాలు మార్చు

 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: