కురియన్‌ జోసెఫ్‌ భారతదేశానికి చెందిన మాజీ న్యాయమూర్తి. ఆయన 2018 నవంబరు 29న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశాడు.[1] ఆయన టాప్‌–10 సుప్రీం జడ్జీల జాబితాలో 1,035 తీర్పులతో పదో స్థానంలో ఉన్నాడు.

కురియన్ జోసెఫ్
కురియన్ జోసెఫ్


పదవీ కాలం
8 మార్చి 2013 – 29 నవంబర్ 2018
నియమించిన వారు ప్రణబ్ ముఖర్జీ

హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
పదవీ కాలం
8 ఫిబ్రవరి 2010 – 7 మార్చి 2013
నియమించిన వారు ప్రతిభా పాటిల్
ముందు జగదీష్ బల్ల
తరువాత ఆర్.బి. మిశ్రా

కేరళ హైకోర్టు న్యాయమూర్తి
పదవీ కాలం
12 జులై 2000 – 7 ఫిబ్రవరి 2010

వ్యక్తిగత వివరాలు

జననం (1953-11-30) 1953 నవంబరు 30 (వయసు 71)
కేరళ
పూర్వ విద్యార్థి మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కేరళ
కేరళ యూనివర్సిటీ

జననం, విద్యాభాస్యం

మార్చు

కురియన్ జోసెఫ్ 1953 నవంబరు 30న కేరళలో జన్మించాడు. ఆయన కేరళ లా అకాడమీ లా కాలేజీలో న్యాయశాస్త్రంలో పట్టా అందుకొని, న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని కేరళ హైకోర్టులో 1979లో ప్రాక్టీసును ప్రారంభించాడు.

వృత్తి జీవితం

మార్చు

కురియన్ జోసెఫ్ జోసెఫ్ 1979లో న్యాయవాద వృత్తి ప్రారంభించి 1983 నుండి 1985 వరకు కొచ్చిన్ యూనివర్సిటీ సెనేట్ సభ్యుడిగా, 1996లో మహాత్మాగాంధీ యూనివర్శిటీ భారతీయ న్యాయ ఆలోచన బోర్డు సభ్యుడిగా, 2006 నుండి 2008 వరకు కేరళ జ్యుడీషియల్ అకాడమీ ప్రెసిడెంట్, 2006 నుండి 2009 వరకు కేరళ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్‌గా, 2008లో లక్షద్వీప్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఛైర్మన్‌గా, 1987లో కేరళ ప్రభుత్వ ప్లీడర్‌గా, 1994 నుండి 1996 వరకు అదనపు అడ్వకేట్ జనరల్‌గా పనిచేశాడు.

కురియన్ జోసెఫ్ 2000లో కేరళ హైకోర్టులో న్యాయవాదిగా నియమితులయ్యాడు. ఆయన 2010, ఫిబ్రవరి 8 నుంచి 2013 మార్చి వరకూ హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన అనంతరం 2013 మార్చి 8న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితుడై 2018 నవంబరు 29న పదవీ విరమణ చేశాడు.[2]

గుర్తించదగిన కేసులు

మార్చు

జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగవిరుద్ధమనీ, చెల్లదని ప్రకటించిన ధర్మాసనంలో ఉన్నాడు.[3] కొలీజియం సిఫార్సులపై కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడంపై, తాజ్‌మహల్‌ పరిరక్షణపై ఆయన చాలాసార్లు బహిరంగ లేఖలు రాశాడు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో జడ్జీల నియామకానికి కేంద్రం తీసుకొచ్చిన నేషనల్‌ జ్యూడీషియల్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ చట్టాన్ని జస్టిస్‌ జోసెఫ్‌ బెంచ్‌ కొట్టివేసింది.

మూలాలు

మార్చు
  1. Sakshi (30 November 2018). "జస్టిస్‌ జోసెఫ్‌ పదవీ విరమణ". Archived from the original on 21 October 2021. Retrieved 21 October 2021.
  2. Hindustan Times (29 November 2018). "Justice Kurian Joseph retires from Supreme Court after five-and-a-half-year tenure" (in ఇంగ్లీష్). Archived from the original on 6 March 2021. Retrieved 21 October 2021.
  3. LIVELAW (22 August 2017). "This Is What Supreme Court Said In Triple Talaq Judgment [Read Judgment]" (in ఇంగ్లీష్). Archived from the original on 21 October 2021. Retrieved 21 October 2021.