తిరుమల ఆలయంలోని వేంకటేశ్వర స్వామి మూలవిగ్రహం ఎదురుగా ఉండే గడప. ఆళ్వారులలో ఒకడు, తిరువాన్కూరు మహారాజు కులశేఖరుని పేరు మీదుగా ఈ గడప పేరు ఏర్పడింది.

పేరు వెనుక కథసవరించు

కేరళ ప్రాంతానికి చెందిన విష్ణుభక్తుడు, తిరువాన్కూరు రాజ్యానికి మహారాజు కులశేఖరుడు. 12మంది వైష్ణవ మహాభక్తులు ఆళ్వారులలో ఆయన కూడా ఒకరు. సా.శ. 7వ శతాబ్దంలో ముకుందమాల అనే గ్రంథాన్ని రచించి భగవంతునికి అంకితం చేశారు. ఆ గ్రంథంలో తిరుమల దేవునితో నీ సన్నిధికి దేవతలు, అప్సరసలు, మహాభక్తులు ఎందరో వస్తారు. అటువంటి నీ సన్నిధిలో గడపగా ఉన్నా నా జన్మ తరించినట్లేనని తన కోరిక విన్నవించుకున్నారు. కులశేఖరుడు గడపగా మారాడన్న భావనతో ఈ గడపను కులశేఖర పడి అని పిలుస్తారు.[1]

ప్రాధాన్యతసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

కులశేఖరుడు

మూలాలుసవరించు

  1. తిరుమల చరితామృతం:పి.వి.ఆర్.కె.ప్రసాద్:ఎమెస్కో:ఆగస్ట్ 2013:పేజీ.7