కూలీ-బేగార్ ఉద్యమం

బాగేశ్వర్ పట్టణంలోని కుమావున్ "కూలీ-బెగార్ ఉద్యమం" సాధారణ ప్రజలచే అహింసా ఉద్యమం

1921 లో యునైటెడ్ ప్రొవిన్సులలో బాగేశ్వర్ పట్టణంలోని కుమావున్ " కూలీ-బెగార్ ఉద్యమం " సాధారణ ప్రజలచే అహింసా ఉద్యమంగా ఆరంభం అయింది. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన బద్రీ దత్ పాండే ఉద్యమం విజయం సాధించిన తరువాత 'కుమావున్ కేసరి' గా గౌరవించబడ్డాడు. ఈ ఉద్యమం లక్ష్యం కూలీ-బెగార్ విధానానన్ని ముగింపుకు తీసుకురావాలని బ్రిటీషు మీద ఒత్తిడి తెచ్చింది. మహాత్మా గాంధీ ఈ ఉద్యమాన్ని ప్రశంసిస్తూ, 'రక్తరహిత విప్లవం' అని పేరు పెట్టారు.

ఆరంభం, కారణాలు మార్చు

కుమాన్ పర్వత ప్రాంతాలలో నివసించే ప్రజలు ప్రయాణించే బ్రిటీష్ అధికారుల సామాను ఉచితంగా రవాణా చేయాలని రూపొందించిన చట్టానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం ఆరంభం అయింది.[1] వివిధ గ్రామాలలో 'గ్రామాధికారి'కి కూలీలను అందుబాటుకు తీసుకు వచ్చే బాధ్యత అప్పగించబడింది.[2] ఈ పని కోసం అక్కడ ఒక సాధారణ రిజిస్టర్ ఉడేది. దీనిలో అన్ని గ్రామస్తుల పేర్లు వ్రాయబడ్డాయి. ప్రతి ఒక్కరూ ప్రత్యామ్నాయంగా ఈ పనిని చేయవలసి వచ్చింది.[3]


గ్రామాధికారులు, భూస్వాములు, పత్వార్ల కూటమి కారణంగా ప్రజల మధ్య అసంతృప్తి అధికరించింది. ప్రజల మధ్య ఉన్న వివక్షత గ్రామాధికారి, పత్వారి వారి వ్యక్తిగత ఆసక్తుల తృప్తిపరచుకోవడానికి విధానాన్ని ప్రోత్సహించడం ప్రారంభించారు. కొన్నిసార్లు ప్రజలు చాలా అసహ్యకరమైన విషయాలను కూడా చేయాలని ఒత్తిడి చేశారు. బ్రిటీషువారి చెత్తను తీసివేయడం లేదా బట్టలు కడగడం వంటివి. స్థానికులు భౌతికంగా, మానసికంగా బ్రిటీషు వారి చేత దోపిడీ చేయబడ్డారు. చివరికి ప్రజలు దీనిని వ్యతిరేకించారు.

చరిత్ర మార్చు

చంద్ పాలకులు పాలనా సమయంలో రాజ్యంలో గుర్రాలకు పన్ను విధించడం ప్రారంభించారు. ఇది 'కూలీ బేగార్' దోపిడీ తొలి రూపం. ఇది గూర్ఖాస్ పాలనలో విస్తృతమైన పరిపాలనా విధానంగా మారింది. [4] ప్రారంభంలో బ్రిటీష్ వారు దాన్ని అణిచివేసినప్పటికీ క్రమక్రమంగా ఈ విధానాన్ని తిరిగి అమలు చేస్తూ దానిని మరింత బలీయం చేసారు.[5] ఇంతకుముందు ఇది సాధారణ ప్రజానీకానికి ఉండేది కాదు. భూస్వాములు నుండి పన్ను వసూలు చేసే జీతగాళ్ళుకు ఉండేది. తరువాత ఈ ఆచారం నేరుగా పాలెగాళ్ళను ప్రభావితం చేసింది. కానీ వాస్తవానికి భూమిలేని రైతులు, కార్మికులు, నియమిత వేతనంగా అంగీకరించిన వేతనాన్ని అంగీకరించిన బలహీనవర్గాలు బానిసత్వంలో సంపన్న భూస్వాములు, గ్రామాధికారులు ప్రధానపాత్ర వహించారు. స్థానిక ప్రజల వ్యతిరేకత ఉన్నప్పటికీ ఈ ఆచారం కొంతకాలం కొనసాగింది

నేపథ్యం మార్చు

1857 నాటి ఇండియన్ తిరుగుబాటు సమయంలో కుమావున్ ప్రాంతానికి ప్రవేశ ద్వారంగా ఉన్న హల్ద్వాను రోహిల్ఖండ్ తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. బ్రిటిష్ తిరుగుబాటును శైశవ్యంలో అణిచివేసేందుకు చేసిన ప్రయత్నంలో విజయం సాధించినప్పటికీ అణచివేత కారణంగా ఏర్పడిన ఉద్రిక్తత ఎప్పటికప్పుడు వివిధ రూపాలలో బహిర్ఘతమైంది.[6] కుమావున్ అడవులలో జరుగుతున్న బ్రిటిషు దోపిడీకి అసంతృప్తి అధికరించింది.[1]

1913 లో కుమావున్ డివిజన్ నివాసితులకు కూలీ బేగార్ నిర్బంధం చేయబడడం ప్రతిచోటా వ్యతిరేకించబడింది. ఉద్యమానికి బద్రి దాట్ పాండే అల్మోరా నాయకత్వంలో ఆనుసూయ ప్రసాద్ బహుగుణ, పండిట్ వంటి ఇతర నాయకులు ప్రధానపాత్ర వహించారు. గర్హ్వాల్, కాశీపూర్లలో గోవింద్ బాల్లాభ్ పంత్ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.[7] బద్రీ దత్ పాండే అల్మోరా అక్బర్ ద్వారా ఈ దురాక్రమణకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశాడు. [8] 1920 లో నాగపూరులో వార్షిక సమావేశం జరిగింది. పిటి గోవింద్ బల్లభ్ పంత్, బద్రీ దత్ పాండే, హర్ గోబింద్ పంత్, విక్టర్ మోహన్ జోషి, శ్యాం లాల్ షా మొదలైన పలు నాయకులు కూలీ బీహార్ ఉద్యమంలో మహాత్మా గాంధీ ఆశీర్వాదం తీసుకోవడానికి హాజరయ్యారు.[9] వారు తిరిగి వచ్చినప్పుడు వారు ఈ చెడుకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన పెంచడం ప్రారంభించారు.

ఉద్యమం మార్చు

1921 జనవరి 14 న ఉత్తరాయని ఉత్సవం సందర్భంగా ఉద్యమం సరయు, గోమతి సమ్మేళనం (బాగద్) వద్ద ప్రారంభించబడింది.[10][11][12] ఈ ఉద్యమాన్ని ప్రారంభించే ముందు జిల్లా మేజిస్ట్రేట్ ఒక నోటీసు జారీచేసింది. హర్గోబిండ్ పంత్, లాలా చిరంజిలాల్, బద్రీ దట్ పాండే ఈ నోటీసు ప్రభావం చూపలేదు.[13] ఈ ఉద్యమంలో పాల్గొనటానికి, వివిధ గ్రామాల నుండి ప్రజలు ఉత్సవ మైదానానికి వచ్చి దానిని భారీ ప్రదర్శనగా మార్చారు. [14] ప్రజలు ముందుగా బాగ్నాథ్ దేవాలయానికి ప్రార్ధనలు జరపటానికి వెళ్లారు, తరువాత సుమారు 40 వేల మంది సరయు భగద్కు వెళ్ళి జెండాతో కూడిన ఊరేగింపుతో "కూలి బేగర్" ను ముగించారు. తరువాత సరయూ మైదానం బద్రీ దట్ పాండే సమావేశంలో ప్రసంగిస్తూ, "పవిత్రమైన సరయు నీటిని తీసుకొని బాగ్నాథ్ దేవాలయాన్ని సాక్షిగా 'కూలీ యుతర్', 'కూలీ బీగర్' , 'కూలీ బురిడాష్' ఇంకా ఏమైనా ఇక మేము భరించలేము " అని ప్రమాణం చేసారు. భారతీయ ప్రజలందరూ ఈ రికార్డును తీసుకున్నారు. తమతో పాటు 'రికార్డు రిజిస్టర్'ని తీసుకువచ్చిన గ్రామ పెద్దలు ఈ రిజిస్టర్లను భారత్ మాతా ప్రశంసిస్తూ నినాదాలు చేస్తూ నదీ సంగమంలో రికార్డులను విసిరి వేసారు.[15]

గుంపులో ఉన్న అల్మోరా జిల్లా డిప్యూటీ కమీషనర్ ఉద్యమకారుల మీద కాల్పులు చేయాలని కోరుకుని పోలీసు బలగం లేనందున తిరిగి వెళ్లాడు.

ఉద్యమం తరువాత మార్చు

ఈ ఉద్యమం విజయం తర్వాత ప్రజలు బద్రీ దత్ పాండేకి 'కుమావున్ కేసరి' అనే శీర్షిక ఇచ్చారు. ప్రజలు ఉద్యమానికి మద్దతునిచ్చి ఖచ్చితంగా అనుసరించి విధానానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసారు. ఫలితంగా హౌస్లో బిల్లును తీసుకురావడం ద్వారా సంప్రదాయాన్ని ముగించేలా ప్రభుత్వం ఒత్తిడికి గురైంది.[16][17] మహాత్మా గాంధీని ఈ ఉద్యమం చాలా ఆకర్షించి 1929 లో బగేశ్వర్, కౌసనిల ప్రదర్శనలను సందర్శించాడు.[18][19] ఆయన చనుండలో ఒక గాంధీ ఆశ్రయాన్ని కూడా స్థాపించాడు. తరువాత యంగ్ ఇండియాలో ఈ ఉద్యమం గురించి మహాత్మా గాంధీ రాశారు. "దీని ప్రభావం పూర్తయిందని ఇది రక్తరహిత విప్లవం." [20]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Coolie Begar and Forest Dissent.
  2. Dainik Jagran 13 January 2016
  3. Dainik Jagran 13 January 2016
  4. Pathak 1991
  5. Pathak 1991
  6. Dainik Jagran 17 May 2013
  7. Amar Ujala 10 September 2016
  8. Amar Ujala 15 August 2016
  9. Dainik Jagran 17 May 2013
  10. The Times of India 3 January 2015
  11. Amar Ujala 12 January 2014
  12. The Tribune 14 January 2014
  13. Dainik Jagran 13 January 2016
  14. Amar Ujala 12 January 2014
  15. Dainik Jagran 17 May 2013
  16. Amar Ujala 12 January 2014
  17. Amar Ujala 15 August 2016
  18. The Times of India 3 January 2015
  19. Dainik Jagran 13 January 2016
  20. The Times of India 3 January 2015