కెంచం పురుషోత్తమరావు

Kenchem Purushothamarao Indo German Friendship Society, (GDR) కెంచం పురుషోత్తమరావు. ఆజానుబాహుడు, మంచి తెలుపు, స్ఫురద్రూపం, కొంచం నత్తి. వీరి తండ్రి బిందుమాధవారావు పురుషోత్తమరావు రెండో ప్రపంచ యుద్ధంలో నావికా దళంలోచేరి పనిచేశారు. ఇండో జి.డి.ఆర్.సాంస్కృతిక, మైత్రీ సంస్థ నెల్లూరు జిల్లా శాఖను చాలాకాలం నిర్వహించడమేకాక, కమ్యూనిస్టు పార్టీ అభిమాని, సానుభూతిపరులు, CPIతో సంబంధాలు ఉండేవి, సోవియట్ యూనియన్, జిడిఆర్ దేశాల్లో పర్యటించడమేగాక, జి.డి.ఆర్.కు పొగాకు ఎగుమతి వంటి ఎదో వ్యాపారంలో భాగస్వామి. జెర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ (జిడిఆర్)కు పొగాకు ఎగుమతి లైసెన్స్ ఉండేది. దాన్ని ఏదో కంపెనీ వారికి ఇచ్చి ఏటా కొంత ఆదాయం పొందేవారు. ఆరోజుల్లో నెల్లూరు పురజనుల్లో ప్రముఖుడు, వివాద రహితుడు, ప్రామినెంట్ సిటిజన్. పురుషోత్తమరావు మాతామహులు వేంకటగిరి దివానుగ చేశారు. వీరు కన్నడ మాట్లాడే మాధ్వబ్రాహ్మణుులు, వీరి అన్న నారాయణరావు న్యాయవాది. నెల్లూరు మండపాల వీధీలో రాఘవేంద్రస్వామి మఠం ఎదురుగా, స్వంత ఇంట్లో అన్న నారాయణరావు కుటుంబంతో కలసి అవివాహితుడయిన పురుషోత్తమరావు ఉండేవారు. ఈయన న్యాయవాది వి.అనంతరామయ్య గారి ఇంటికి తరచూ వచ్చేవారు. పురుషోత్తమరావు నెల్లూరులో Indo GDR Friendship Society నడిపుతూ, ఇండో జిడిఆర్ తరఫున ఏదో పత్రిక తెప్పించి పరిచయస్తులకు ఉచితంగా పంపించేవారు, జిడిఆర్ సినిమాలు తెప్పించి నెల్లూరు ప్రొఫిల్మ్ (ఫిల్మ్.సొసైటీ) వారి ప్రదర్శనలకు ఇచ్చేది. తూర్పు జర్మనీ దేశపు కథలు కొన్ని అనువాదం చేయించి తెలుగులో పుస్తకంగా అచ్చు వేయించారు. చివరిదశలో రామకృష్ణ మఠంలో సన్యాసం తీసుకొని ఇందుకూరుపేటలో కాలం వెళ్ళదీస్తూ, 80 సంవత్సరాల పైబడి జీవించారు.


మూలాలు: