కెలోరీ అనేది శక్తిని కొలిచేందుకు వాడే ఒక ప్రమాణం.[1]

సాధారణంగా ఉష్ణశక్తిని కొలవడానికి వాడతారు. మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, బతికి ఉండాలన్నా, ఏ పని చేయాలన్నా శక్తి అవసరం. అది మనకు ఆహారం ద్వారా లభిస్తుంది. ఒక మనిషికి ఎంత ఆహారం కావాలి,. తద్వారా ఎన్ని కెలోరీల శక్తి అవసరం అనే విషయాలు ఆ మనిషి వయసు, వృత్తి, ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. సాధారణంగా 30 సంవత్సరాల వయసుగల వ్యక్తికి సుమారు 3500 కెలోరీల శక్తి అవసరం. యవ్వనంలో ఉన్నవారికి అదనంగా శక్తి అవసరం. చలి ప్రాంతాల్లో ఉన్నవారికి, గర్భిణులకు, అధిక శారీరక శ్రమ చేసేవారికి కూడా అదనపు శక్తి అవసరం అవుతుంది. మనం తినే ఆహారంలో కార్బొహైడ్రేట్లు, మాంసకృత్తులు (ప్రొటీన్లు), కొవ్వులు (ఫ్యాట్స్) ప్రధాన శక్తిదాయకాలు. మనకు సమారు 60 శాతం శక్తి పిండి పదార్థాల (కార్బొహైడ్రేట్స్) నుంచి వస్తుంది. దాదాపు 20 శాతం మాంసకృత్తులు, మరో 20 శాతం కొవ్వు పదార్థాల నుంచి లభిస్తుంది. కెలోరీలు మరీ ఎక్కువయితే ఊబకాయం (ఒబేసిటీ) వస్తుంది. మరీ తక్కువైతే సొమ్మసిల్లి పడిపోతారు. సంతులన ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అందరి కర్తవ్యం.

నిర్వచనం

మార్చు

ప్రమాణిక లేదా స్ధిర వాతావరన పీడనంలో ఒక గ్రాము నీటి (నీటిలో కరగి వున్న గాలి/ఆక్సిజను తొలగింప బడిన) ఉష్ణోగ్రతను 1 °C పెంచుటకు వినియోగించిన శక్తి లేదా ఉష్ణశక్తిని కెలోరి అంటారు.ఒక కిలో నీటి ఉష్ణోగ్రతను 1 °C పెంచుటకు ఉపయోగించిన శక్తి/ఉష్ణశక్తిని కిలో కెలోరి అంటారు.

కొలమానము

మార్చు
పేరు సంకేతము మార్పిడి వివరాలు
ఉష్ణ రసాయన కెలోరీ calth 4.184 J

≈ 0.003964 BTU ≈ 1.163×10−6 kWh ≈ 2.611×1019 eV

శక్తి యొక్క కచ్చితమైన విలువ 4.184 జౌళ్ళు [3][4][5][6]
4 °C కెలోరీ cal4 ≈ 4.204 J

≈ 0.003985 BTU ≈ 1.168×10−6 kWh ≈ 2.624×1019 eV

సాధారణ ఉష్ణోగ్రతా పీడనాల వద్ద ఒక గ్రాము నీటిని 3.5 నుండి 4.5 °C వరకు వేడిచేయడానికి కావలసిన శక్తి.
15 °C కెలోరీ cal15 ≈ 4.1855 J

≈ 0.0039671 BTU ≈ 1.1626×10−6 kWh ≈ 2.6124×1019 eV

సాధారణ ఉష్ణోగ్రతా పీడనాల వద్ద ఒక గ్రాము నీటిని 14.5 నుండి 15 °C కి వేడిచేయడానికి కావలసిన శక్తి. ప్రయోగాత్మకం విలువలు 4.1852 J నుండి 4.1858 J వరకు ఉంటాయి. 1950 లో సి.ఐ.పి.ఎం ఈ విలువను 4.1855 గా ప్రచురించింది.[3]
20 °C కెలోరీ cal20 ≈ 4.182 J

≈ 0.003964 BTU ≈ 1.162×10−6 kWh ≈ 2.610×1019 eV

సాధారణ ఉష్ణోగ్రతా పీడనాల వద్ద ఒక గ్రాము నీటిని 19.5 నుండి 20.5 °C కి వేడిచేయడానికి కావలసిన శక్తి.
మధ్యమ కెలోరీ (మీన్ కెలోరీ) calmean ≈ 4.190 J

≈ 0.003971 BTU ≈ 1.164×10−6 kWh ≈ 2.615×1019 eV

సాధారణ ఉష్ణోగ్రతా పీడనాల వద్ద ఒక గ్రాము నీటిని 0 నుండి 100 °C కి వేడిచేయడానికి కావలసిన శక్తిలో ⅟100 వంతు.
అంతర్జాతీయ కెలోరీ (1929) ≈ 4.1868 J

≈ 0.0039683 BTU ≈ 1.1630×10−6 kWh ≈ 2.6132×1019 eV

కచ్చితంగా ⅟860 అంతర్జాతీయ వాట్ అవర్స్ = 180⁄43 అంతర్జాతీయ జౌళ్ళు .[note 1]
అంతర్జాతీయ కెలోరీ (1956) calIT ≡ 4.1868 J

≈ 0.0039683 BTU ≈ 1.1630×10−6 kWh ≈ 2.6132×1019 eV

కచ్చితంగా 1.163 mW·h = 4.1868 J. ఈ నిర్వచనాన్ని 1956 జూలైలో లండన్ లో జరిగిన ఐదవ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ఆన్ ప్రాపెర్టీస్ ఆఫ్ స్టీం నుండి తీసుకున్నారు.[3]

మూలాలు

మార్చు
  1. http://abcnews.go.com/Health/WellnessResource/story?id=6762725
  2. http://www.medicalnewstoday.com/articles/263028.php
  3. 3.0 3.1 3.2 International Standard ISO 31-4: Quantities and units, Part 4: Heat. Annex B (informative): Other units given for information, especially regarding the conversion factor. International Organization for Standardization, 1992.
  4. FAO (1971). "The adoption of joules as units of energy". The 'Thermochemical calorie' was defined by Rossini simply as 4.1833 international joules in order to avoid the difficulties associated with uncertainties about the heat capacity of water (it has been redefined as 4.1840 J exactly).
  5. Rossini, Fredrick (1964). "Excursion in Chemical Thermodynamics, from the Past into the Future". Pure and Applied Chemistry. 8 (2): 107. doi:10.1351/pac196408020095. Retrieved 21 January 2013. both the IT calorie and the thermochemical calorie are completely independent of the heat capacity of water.
  6. Lynch, Charles T. (1974). Handbook of Materials Science: General Properties, Volume 1. CRC Press. p. 438.
  7. International Union of Pure and Applied Chemistry (IUPAC) (1997). "1.6 Conversion tables for units". Compendium of Analytical Nomenclature (PDF) (3 ed.). ISBN 0-86542-615-5.
  1. The figure depends on the conversion factor between international joules and absolute (modern) joules. Using the mean international ohm and volt (1.00049 Ω, 1.00034 V[7]), the international joule is about 1.00019 J, using the US international ohm and volt (1.000495 Ω, 1.000330 V) it is about 1.000165 J, giving 4.18684 J and 4.18674 J, respectively.

బయటి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=కెలోరి&oldid=4094867" నుండి వెలికితీశారు