కె.ఎం. సచిన్ దేవ్

కె.ఎం. సచిన్ దేవ్ కేరళ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బలుస్సేరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

కె.ఎం. సచిన్ దేవ్
కె.ఎం. సచిన్ దేవ్


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
మే 2021 - ప్రస్తుతం
ముందు పురుషణ్ కదలండీ
నియోజకవర్గం బాలుస్సేరి

రాష్ట్ర కార్యదర్శి
స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, కేరళ

వ్యక్తిగత వివరాలు

జననం 1993 అక్టోబర్ 18
నెల్లిక్కొడ్, కోజికోడ్‌, కేరళ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)
తల్లిదండ్రులు కె.ఎం. నందకుమార్ , ఎం.షీజా
నివాసం కోజికోడ్‌
పూర్వ విద్యార్థి * ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, బిఏ
  • ప్రభుత్వ న్యాయ కళాశాల, కోజికోడ్‌

జననం, విద్యాభాస్యం

మార్చు

సచిన్ దేవ్ 1993 అక్టోబర్ 18న కేరళ రాష్ట్రం, కోజికోడ్‌ జిల్లా, నెల్లిక్కొడ్ గ్రామంలో కేఎం. నందకుమార్, షీజా దంపతులకు జన్మించాడు. ఆయన కోజికోడ్‌లోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుండి ఇంగ్లీష్‌లో డిగ్రీ, కోజికోడ్‌లోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుండి ఎల్ఎల్‌బీ చేశాడు.

రాజకీయ జీవితం

మార్చు

కె.ఎం.సచిన్ దేవ్ (సీపీఎం) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్‌ఐ) రాష్ట్ర కార్యదర్శిగా, ఎస్ఎఫ్‌ఐ అఖిల భారత జాయింట్ సెక్రటరీగా పని చేశాడు. ఆయన ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన సమయంలో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాడు. సచిన్ దేవ్ 2021లో జరిగిన కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బాలుస్సేరి నుండి లెప్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) కూటమి తరపున సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మజన్ బోల్గట్టి పై 20372 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2] ఆయన 15వ కేరళ అసెంబ్లీలో అడుగుపెట్టిన అతి చిన్న వయస్కుడైన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించాడు.

మూలాలు

మార్చు
  1. The Hindu (3 May 2021). "Balussery sends Sachin Dev to Assembly" (in Indian English). Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
  2. OnManorama (29 March 2021). "College batchmates represent young blood in Kerala politics". Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.