కె.రతంగ్ పాండురెడ్డి

మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడైన కె.రతంగ్ పాండురెడ్డి నారాయణపేట మండలం సింగారంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. 1992లో భారతీయ జనతా పార్టీలో చేరి గ్రామకమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంచెలంచెలుగా ఎదుగుతూ పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా, పార్టీ మండల అధ్యక్షులుగా, 2001లో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా, 2004లో రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2005లో తొలి ఎంపీటీసి ఎన్నికలలో సింగారం నుంచి ఎన్నికై ఏకగ్రీవంగా మండల అధ్యక్ష పదవి పొందారు. 2009లో జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 2010 మే లో జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.[1]

కె.రతంగ్ పాండురెడ్డి

మూలాలు మార్చు

  1. ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 13-05-2010