కె. ఆర్. ఇందిరాదేవి

కె. ఆర్. ఇందిరాదేవి (1949 – 2017) తమిళ సినిమాలో చురుకుగా ఉన్న 20వ శతాబ్దపు భారతీయ నటి. ఆమె సపోర్టింగ్ రోల్స్‌కి బాగా ప్రసిద్ది చెందింది. అలాగే విజయవంతమైన డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ఆమె దాదాపు ఐదు దశాబ్దాల తన కెరీర్‌లో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంలో 250కి పైగా చిత్రాలలో నటించింది.[2] కొంజుమ్ కుమారి (1963)లో ఆమె కథానాయికగా రంగప్రవేశం చేసింది. తమిళనాడు ప్రభుత్వం ఆమెకు కలైమామణి పురస్కారంతో సత్కరించింది.[3]

కె. ఆర్. ఇందిరాదేవి
జననం
కాంచీపురం రామసామి ఇందిరాదేవి

(1949-01-01)1949 జనవరి 1 [1]
కాంచీపురం, బ్రిటిష్ ఇండియా
మరణం2017 మార్చి 16 (వయస్సు 68)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
ఇతర పేర్లుఇందిర , ఇందిరాదేవి
వృత్తినటి, డబ్బింగ్ ఆర్టిస్ట్
క్రియాశీల సంవత్సరాలు1959 - 2017
జీవిత భాగస్వామిశంకర నారాయణన్
పిల్లలుజయగీత (కుమార్తె)
తల్లిదండ్రులుకె. ఎస్. రామసామి (తండ్రి)
బంధువులుఅనురాధ (సోదరి)
పురస్కారాలుకళైమామణి అవార్డు

కెరీర్

మార్చు

కాంచీపురం జిల్లాలో ఇందిరాదేవి జన్మించింది. ఆమె 14 సంవత్సరాల వయస్సులో చెన్నైకి వెళ్లి రంగస్థల నాటకాలలో ప్రదర్శనను ప్రారంభించింది. ఆ తర్వాత చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి సపోర్టింగ్ రోల్‌లో కెరీర్‌ని ప్రారంభించింది. ఆమె 1959లో కన్ తిరంధతుతో లో నటించింది. ఎం. కరుణానిధికి తెరపై ఆమె ఒక చక్కని జంట. అలాగే ఎం. ఎన్. నంబియార్‌, జెమినీ గణేశన్‌, ఎం.ఆర్‌.రాధా, శివకుమార్‌లతో కూడా కలిసి నటించింది. ఆమె 1963లో మోడరన్ థియేటర్స్ వారి కొంజుమ్ కుమారితో హీరోయిన్‌గా చేసింది. ఆమె నటించిన చిత్రాలలో మరపురానివి కంధన్ కరుణై, సింధు భైరవి, మన్నన్, పనక్కారన్ వంటివి చెప్పవచ్చు. ఆమె చివరి చిత్రం గిరివాళం (2005) కాగా అనేక టీవీ సీరియల్స్‌లో నటించింది. 500కి పైగా చిత్రాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేసింది.

వ్యక్తిగత జీవితం

మార్చు

కె. ఆర్. ఇందిరాదేవి తండ్రి కె. ఎస్. రామసామి ప్రముఖ కర్నాటక గాయకుడు, రంగస్థల కళాకారుడు.[4] ఆమె తల్లి అనురాధ ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆమెకు శంకర నారాయణన్‌తో వివాహం జరిగింది. వారికి జయగీత అనే ఒక కుమార్తె ఉంది.[5]

అవార్డు

మార్చు

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కె. ఆర్. ఇందిరాదేవికి కలైమామణి అవార్డు ప్రధానం చేసింది.

68 సంవత్సరాల ఇందిరాదేవి 2017 మార్చి 16న గుండెపోటుతో మరణించింది.[6]

మూలాలు

మార్చు
  1. "Personal details of Actress K. R. Indira Devi". tamilstar. Archived from the original on 2017-03-19. Retrieved 2017-03-20.
  2. "Actress Kalaimamani K. R. Indira no More". andhrawishesh. Archived from the original on 2017-03-19. Retrieved 2017-03-18.
  3. "கலைமாமணி பட்டம் பெற்ற பழம்பெரும் நடிகை கே. ஆர். இந்திராதேவி காலமானார்". tamil.samayam. Retrieved 2017-03-20.
  4. "Actress K. R. Indira Devi Passes Away". kollytalk. Archived from the original on 2017-03-20. Retrieved 2017-03-20.
  5. "Famous Dubbing Artist K. R. Indira Passed Away". tamilsaga. Retrieved 2017-03-20.
  6. "Actress K. R. Indira Devi Passes Away". tollywood. Archived from the original on 2017-03-18. Retrieved 2017-03-18.