కేతకీ దేవి సింగ్

కేత్కి దేవి సింగ్ (జననం 1958 జూలై 3) మాజీ పార్లమెంటు సభ్యురాలు. ఆమె భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్‌లోని గోండా జిల్లా నియోజకవర్గం నుండి ఎన్నికైన మాజీ జిల్లా కౌన్సిల్ చీఫ్.

కేతకీ దేవి సింగ్
పార్లమెంటు సభ్యురాలు, లోక్ సభ
In office
1996–1998
అంతకు ముందు వారుబ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్
తరువాత వారుకీర్తి వర్ధన్ సింగ్
నియోజకవర్గంగొండా లోక్ సభ నియోజకవర్గం
ప్రెసిడెంట్, జిల్లా పంచాయతీ
In office
2018–2021
అంతకు ముందు వారుశ్రద్ధా సింగ్
తరువాత వారుఘనశ్యామ్ మిశ్రా
నియోజకవర్గంగొండా జిల్లా, జిల్లా పంచాయతీ
లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యురాలు, గొండా జిల్లా, జిల్లా పంచాయతీ
In office
2015–2021
తరువాత వారుమహేంద్ర సింగ్
నియోజకవర్గంనవాబ్‌గంజ్
వ్యక్తిగత వివరాలు
జననం (1969-07-03) 1969 జూలై 3 (వయసు 55)
జాతీయతభారతీయురాలు
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామిబ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్
సంతానం4, ప్రతీక్ భూషణ్ సింగ్, కరణ్ భూషణ్ సింగ్ లతో సహా
నైపుణ్యంరాజకీయ నాయకురాలు

ఆమె 1958 జూలై 3న ఉత్తరప్రదేశ్ మహారాజ్‌గంజ్ జిల్లాలోని బ్రిజ్మాన్‌గంజ్‌లో జన్మించింది. ఆమె 1980 మే 11న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ని వివాహం చేసుకుంది. ఆమెకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే, పెద్ద కుమారుడు శక్తి సింగ్ మరణించాడు, రెండవ పెద్ద కుమారుడు ప్రతీక్ భూషణ్ సింగ్ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నాడు. గోండా అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా నెగ్గాడు. చిన్న కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ ప్రస్తుతం కైసర్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడుగా పనిచేస్తున్నాడు. అలాగే, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI)కి ఆమె సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పనిచేస్తున్నది. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లోక్‌సభ నియోజకవర్గాలు కైసర్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం, గోండా లోక్‌సభ నియోజకవర్గం, అప్పటి బలరాంపూర్ ఇప్పుడు శ్రావస్తి లోక్‌సభ నియోజకవర్గాల నుండి 6 సార్లు పార్లమెంటు సభ్యుడుగా పనిచేసాడు. అలాగే, ఆయన భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (2011-24) అధ్యక్షుడిగా కూడా పనిచేసాడు.

మూలాలు

మార్చు