కొంపెల్ల (ఇంటిపేరు)

కొంపెల్ల అనేది తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.

చరిత్ర మార్చు

కొంపెల్ల ఇంటిపేరున్నవారిలో ఎందరో ప్రముఖులు ఉన్నారు. వారిలో ఒకరైన కొంపెల్ల లక్ష్మీసోదెమ్మ పెద్దాపురం సంస్థాన వారసుడైన వత్సవాయివారి వారసుడు రాయగజపతిని కాపాడారు. పెద్దాపురాన్ని పట్టుకున్న రుస్తుంఖాన్ వారసుడైన పసిపిల్లవాడు జగపతిరాజుని చంపించేందుకు ప్రయత్నంచేశారు. ఆ పిల్లాణ్ణి తన పిల్లాడిగా నమ్మించే ప్రయత్నం చేసి అతను పసివాణ్ణి ఖైదు చేస్తే తల్లి వేషంలో తానూ ఖైదులో ఉండిపోయి చాన్నాళ్ళు పోషించింది. రుస్తుంఖాన్ భార్యను నమ్మించే ప్రయత్నాలు చేసి, చివరకు అతని మరణానంతరం కొడుకు కాలంలో అత్యంత రహస్యంగా పిల్లాణ్ణి తప్పించింది. ఆపైన కొన్నేళ్ళకు పెద్దాపురం పరిపాలకునిగా వచ్చిన వేరే సేనానిని ఓడించి గద్దెను పొందారు. సాహసము, ఔదార్యాలతో ఆమె చేసిన పనికి, చిన్నతనం నుంచి తన ప్రాణాలను కాపాడేందుకు పడ్డ తాపత్రయానికి గాను ఆమెను సంస్థానాధీశుడయ్యాకా జగపతిరాజు చాలా గౌరవించారు. ఆమె గ్రామానికి ఓ ఊరికి లక్ష్మీపురాగ్రహారం అనే పేరు పెట్టి, అగ్రహారం వ్రాసియిచ్చారు. రాయజగపతిని రక్షించినందువల్ల ఈ గ్రామం అగ్రహారంగా ఇచ్చినందుకు గాను రాయభూపాలపురం, రాయభూపాలపురాగ్రహారం, రాయభూపాలపట్నం అన్న పేర్లు వచ్చాయి.[1]

 
కొంపెల్ల జనార్ధనరావు

ప్రముఖ వ్యక్తులు మార్చు

  • కొంపెల్ల గోపాలకృష్ణమూర్తి - శ్రీగోపాల్ అనే పేరుతో సుప్రఖ్యాతుడైన రేడియో కళాకారుడు. బహుముఖ ప్రజ్ఞాశాలి.
  • కొంపెల్ల జనార్ధనరావు - కవి, పత్రికా సంపాదకుడు, శ్రీశ్రీకి సన్నిహితునిగా తెలుగులో చరిత్రగాంచిన మహాప్రస్థానం కవితాసంకలనానికి అంకితం పొందినవారు.
  • కొంపెల్ల లక్ష్మీసోదెమ్మ - పిఠాపురం సంస్థానాధిపతియైన జగపతిరాజును ఖైదులో ఉండగా తన కుమారుడని అబద్ధమాడి దశాబ్దాల పాటు కాపాడిన వ్యక్తి. ఆమెకు ఓ అగ్రహారాన్ని దానం చేశారు.

మూలాలు మార్చు

  1. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.