కొట్నాక భీంరావు

కొట్నాక భీంరావు ఆదిలాబాదు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఇతను జిల్లాలోనే తొలి గిరిజన పట్టభద్రుడిగా, తొలి గిరిజన శాసనసభ్యుడిగా పేరుపొందారు. 1962లో ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికై అదేస్థానం నుంచి వరసగా 3 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 1989లో ఖానాపుర్ నియోజకవర్గంనుంచి ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర మంత్రివర్గంలో కూడా స్థానం పొందినారు.

కొట్నాక భీంరావు
కొట్నాక భీంరావు

నియోజకవర్గం ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ

రాజకీయ ప్రస్థానం

మార్చు

కొట్నాక భీంరావు 1962లో తొలిసారిగా ఆసిఫాబాదు నుంచి పోటీచేసి 13వేలకుపైగా మెజారిటీతో విజయం సాధించారు. 1967లో, 1972లో కూడా ఇదే స్థానం నుంచి విజయం సాధించి హాట్రిక్ సాధించారు. 1972లో పి.వి.నరసింహారావు మంత్రివర్గంలో కూడా స్థానం పొందారు. 1989లో ఖానాపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి 4వ సారి శాసనసభలో ప్రవేశించారు. ఈ సారి రాష్ట్ర మంత్రివర్గంలో మరోసారి స్థానం పొందారు.