కొడవలి (ఆంగ్లం Sickle) ఒకరకమైన వ్యవసాయ పరికరము, ఆయుధము. దీనిని ఇనుముతో తయారు చేస్తారు.

కొడవలి.

ఉపయోగాలు మార్చు

వీటిని వ్యవసాయంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వరి పంట పక్వానికి వచ్చాక కొడవళ్ళనుపయోగించి కోత కోస్తారు. పొలాలలో సాదారణ ఉపయోగాలైన గడ్డి కోయడం, పళ్ళు కోయడం, కూరగాయలు కోయడం, చిన్న చిన్న చెట్లు, కొమ్మలు నరకడానికి, పాకలు, పూరిగుడిసెల నిర్మాణంలో ఇలా అనేక సందర్భాలలో వీటి ఉపయోగం సామాన్యమానవులకు ఉంటుంది.

ఇక అడవులలో నివసించే ప్రతి ఒక్కరి వద్ద ఇది రక్షణాయుధంగా, ఉపయోగ వస్తువుగా తప్పక వెంట ఉంచుకొంటారు.

రకాలు మార్చు

  • సాధారణ కొడవలి
  • వేట కొడవలి

లిక్కి మార్చు

లిక్కి అనగా కాలానుగుణంగా అరిగి పోయిన కొడవలి. కొడవలి అరిగి పోయిన ప్రతి సారి కక్కు అనగా పదును పెట్టాల్సి వస్తుంది. ఆ విధంగా అనేక సార్లు పదును పెట్టగా అది అరిగి పోయి చిన్నదైపోతుంది. అలా చిన్నదైపోయిన కొడవలిని లిక్కి అంటారు. ఉంటే లిక్కి, పోతే కొడవలి అనే సామెత వాడుకలో ఉంది. సామెతకు వివరణ: ఒకడు మరొకని దగ్గర ఒక లిక్కిని అరువు తీసుకున్నాడు కానీ దాన్నెక్కడో ధారబోసుకున్నాడు. ఆ సంగతే అవతలివ్వక్తికి చెప్పాడు. దానికి లిక్కిని అరువిచ్చిన ఆసామి అయ్యో ఎలాగ? అది మంచి కొడవలి, దాన్ని పోగొట్టావా? వేరే కొడవలినైనా తెచ్చివ్వు మన్నాడు.

విశేషాలు మార్చు

  • కంకి కొడవలి గుర్తును కమ్యూనిస్టులు తమ ఎన్నికల చిహ్నంగా వాడుతున్నారు. ఇక్కడ కొడవలి కర్షకులకు గుర్తు.

వ్యాధులు మార్చు

  • కొడవలి కణాల వ్యాధి (Sickle cell disease) : మన శరీరంలోని ఎర్ర రక్తకణాలు కొన్ని వ్యాధులలో కొడవలి ఆకారంలోకి మారి రక్త ప్రవాహాన్ని అడ్డగిస్తాయి. ఇది ఒక రకమైన రక్తహీనత.

వెలుపలి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=కొడవలి&oldid=2879734" నుండి వెలికితీశారు