కొడాలి వెంకట నారాయణరావు

కొడాలి వెంకట నారాయణరావు (K.V. నారాయణ రావు) కార్మిక నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సిరిపూరు - కాగజ్ నగర్ శాసన సభ్యునిగా , శాసన సభలో ప్రభుత్వ చీఫ్ విప్ గా పనిచేసారు.[1]

కొడాలి వెంకట నారాయణరావు కృష్ణా జిల్లా యలమర్రు లో జన్మించారు[1].

రాజకీయ జీవితం

మార్చు

నారాయణ రావు సిరిపూర్ పేపర్ మిల్స్ ట్రేడ్ యునియన్ కార్యదర్శిగా ,అధ్యక్షడిగా పనిచేసారు. సిరిపూర్ భూ తనకా బ్యాంకు అధ్యక్షునిగా, ఆంధ్ర ప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ది సంస్థ అధ్యక్షుడిగా పనిచేసారు.

1983 లో నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్దిగా సిర్పూరు శాసనసభ నియోజకవర్గం నుండి `మొదటి సారి శాసనసభకు ఏన్నికైనారు.

1985 లో జరిగిన మధ్యంతర ఎన్నికలో తిరిగి అక్కడినుండే ఎన్నికైనారు. శాసన సభలో ప్రభుత్వ చీఫ్ విప్ గా పనిచేసారు.

1989 , 1994 లొ జరిగిన ఎన్నికలలో పరాజయం చెందారు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 భావయ్య చౌదరి, కొత్త (2005). కమ్మ వారి చరిత్ర. గుంటూరు: పావులూరి పబ్లికేషన్. p. 223.