కొనకంటి శ్రీనివాస రెడ్డి
కొనకంటి శ్రీనివాస రెడ్డి భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయనను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా 31 జనవరి 2022న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయగా[1],ఫిబ్రవరి 14న హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశాడు.[2]
కొనకంటి శ్రీనివాసరెడ్డి | |||
పదవీ కాలం 2022 ఫిబ్రవరి 14 – ప్రస్తుతం | |||
నియమించిన వారు | రామ్‌నాథ్ కోవింద్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 3 జూన్ 1966 హైదరాబాద్,తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
తల్లిదండ్రులు | రామలక్ష్మి, లక్ష్మిరెడ్డి | ||
పూర్వ విద్యార్థి | శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ |
జననం, విద్యాభాస్యం
మార్చుకొనకంటి శ్రీనివాసరెడ్డి 3 జూన్ 1966లో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ లో రామలక్ష్మి, లక్ష్మిరెడ్డి దంపతులకు జన్మించాడు. ఆయన హైదరాబాద్‌లోని నాగార్జున జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో (ఎల్‌ఎల్‌బీ) పట్టా అందుకున్నాడు.
వృత్తి జీవితం
మార్చుకొనకంటి శ్రీనివాసరెడ్డి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాక 1991 ఆగస్టులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని సి.పద్మనాభరెడ్డి వద్ద జూనియర్‌గా వృత్తి మెలకువలు నేర్చుకొని తరువాత సొంతంగా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో పాటు, ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా పని చేస్తూ క్రిమినల్ కేసులు వాదించాడు. ఆయన 2019లో 2019లో హైకోర్టు రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)గా నియమితుడయ్యాడు. ఆయనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ ఉమేశ్ ఉదయ్ లలిత్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్‌లతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కు న్యాయమూర్తిగా 31 జనవరి 2022న కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.[3][4]
మూలాలు
మార్చు- ↑ Eenadu (31 January 2022). "ఏపీ హైకోర్టు జడ్జిలుగా ఏడుగురు న్యాయవాదులు". Archived from the original on 3 February 2022. Retrieved 3 February 2022.
- ↑ Andhra Jyothy (14 February 2022). "ఏడుగురు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.
- ↑ Sakshi (1 February 2022). "హైకోర్టుకు ఏడుగురు జడ్జీలు!". Archived from the original on 3 February 2022. Retrieved 3 February 2022.
- ↑ Andhra Jyothy (1 February 2022). "హైకోర్టుకు మరో ఏడుగురు జడ్జీలు". Archived from the original on 3 February 2022. Retrieved 3 February 2022.