కొన్రాడ్ సంగ్మా

కొన్రాడ్ సంగ్మా(జననం 1978 జనవరి 27) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుత మేఘాలయ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు.[1] కొన్రాడ్ సంగ్మా 2016లో అతని తండ్రి పి.ఎ. సంగ్మా మరణించిన తరువాతనుండి నేషనల్ పీపుల్స్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నాడు. 2008లో సంగ్మా మేఘాలయ కేబినెట్లో అతి పిన్న వయసుగల ఆర్థిక మంత్రిగా రికార్డు సాధించాడు.

కొన్రాడ్ సంగ్మా
మేఘాలయ రాష్ట్ర 12వ ముఖ్యమంత్రి
Assumed office
2018 మార్చి 6
గవర్నర్గంగ ప్రసాద్
తథాగత రాయ్
సత్యపాల్ మాలిక్
Deputyప్రెస్టన్ టీన్సొంగ్
అంతకు ముందు వారుముకుల్ సంగ్మా
లోక్‌సభ సభ్యుడు
In office
2016 మే 19 – 2018 ఆగస్టు 27
అంతకు ముందు వారుపి.ఎ సంగ్మా
తరువాత వారుఅగాథ సంగ్మా
నియోజకవర్గంతుర
మేఘాలయ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి
In office
2008–2009
వ్యక్తిగత వివరాలు
జననం (1978-01-27) 1978 జనవరి 27 (వయసు 46)
తుర, మేఘాలయ, భారతదేశం
రాజకీయ పార్టీనేషనల్ పీపుల్స్ పార్టీ
ఇతర రాజకీయ
పదవులు
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి
సంతానం2
తండ్రిపి.ఎ. సంగ్మా
బంధువులుజేమ్స్ సంగ్మా(సోదరుడు)
చదువుఏం.బి.ఎ (ఆర్థికశాస్త్రం) ఇంపీరియల్ కాలేజీ, లండన్

వ్యక్తిగత జీవితం

మార్చు

కొన్రాడ్ సంగ్మా మేఘాలయలోని వెస్ట్ గారో హిల్స్ జిల్లాలోని తురాలో 1978 జనవరి 27న జన్మించాడు.[2] అతని తండ్రి పూర్ణ సంగ్మా మేఘాలయ మాజీ ముఖ్యమంత్రిగా అలాగే లోక్‌సభ స్పీకర్‌గా పని చేసాడు. కొన్రాడ్ తన చిన్న వయసులో ఢిల్లీలో ఉండేవాడు అక్కడే సెయింట్ కొలంబస్ స్కూల్లో తన పాఠశాల విద్యను అభ్యసించాడు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం వార్టన్ స్కూల్ నుండి వ్యవస్థాపక నిర్వహణ వ్యాపార శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పొందాడు, ఆ తరువాత లండన్ ఇంపీరియల్ కాలేజి నుండి ఆర్థిక శాస్త్రంలో ఎం.బి.ఎ పట్టా పొందాడు.

వృత్తి జీవితం

మార్చు

చదువు పూర్తి చేసిన తరువాత,తన తండ్రి పి. ఎ. సంగ్మా సహాయంకోసం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) ప్రచార నిర్వాహకుడిగా సంగ్మా తన రాజకీయ జీవితాన్ని 1990 చివరలో ప్రారంభించాడు. 2004లో జరిగిన మేఘాలయ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి 182 ఓట్లతో ఓటమి పాలయ్యాడు. ఆ తరువాత 2008 సంగ్మా అతని సోదరుడు జేమ్స్ సంగ్మా ఇద్దరు ఎమ్యెల్యే గా గెలుపొందారు.[3][4]

2009 నుండి 2013 వరకు సంగ్మా మేఘాలయ శాసనసభలో ప్రతిపక్ష నాయకుని పదవిలో ఉన్నాడు. ఆ సంవత్సరం ప్రారంభంలో తన తండ్రి మరణించిన తరువాత మార్చి 2016 లో అతను నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి) జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అదే సంవత్సరం మేలో జరిగిన లోక్సభకు ఉప ఎన్నికలో తుర నుండి పోటీ చేసి, రికార్డు స్థాయిలో 1.92 లక్షల ఓట్ల తేడాతో గెలిచాడు.[5]

ముఖ్యమంత్రిగా

మార్చు

2018 మార్చి 6న కొన్రాడ్ సంగ్మా మేఘాలయ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అధికారంలో ఉన్నారు.[6]

మూలాలు

మార్చు
  1. Singh, Shiv Sahay (2018-03-04). "Congress outsmarted in Meghalaya, Conrad Sangma to be sworn in on March 6". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-06-13.
  2. "Five facts to know about Conrad Sangma -- 'probable' CM of Meghalaya". web.archive.org. 2018-03-05. Archived from the original on 2018-03-05. Retrieved 2021-06-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "How a Wharton graduate fits into North-East politics". Rediff. Retrieved 2021-06-13.
  4. "Sangma dynasty gains momentum in Meghalaya". www.rediff.com. Retrieved 2021-06-13.
  5. "సంగ్మా".{{cite web}}: CS1 maint: url-status (link)
  6. Singh, Shiv Sahay (2018-03-06). "Conrad Sangma sworn in as Meghalaya CM". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-06-13.

బాహ్య లంకెలు

మార్చు