కొరవి సత్య నారాయణ కోవారి గోపరాజుకి పినతాత.[1] ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు వహించాడు. సా.శ. 1320- 1345 కాలం మధ్యన ఉన్నవాడు. ఇతను రామాయణం వ్రాసినట్లు కొరవి గోపరాజు ‘సింహాసన ద్వాత్రింశిక’లో పేర్కొన్నాడు. ఇతనికి భీమన అని ఇంకో పేరు కూడా ఉంది. తెలంగాణా ప్రాంతాలలో నివసించాడు. అతను రామాయణం రచించినట్లు ఈ క్రింది పద్యం ద్వారా తెలుస్తుంది[2][3].

క. రామాయణకృతి కృతియై
తామెఱయుచు నంధ్ర కవిపితామహుఁడనఁగా
భూమిని మించిన భీమన
నామంబునఁ బరఁగె సత్యనారన ఘనుఁడై.

ఇతడు 14-వ శతాబ్ది రెండవ భాగమునకు చెందిన వాడు.[4]

మూలాలు

మార్చు
  1. "Nalgonda District-Eminent Personalities". web.archive.org. 2015-07-23. Archived from the original on 2015-07-23. Retrieved 2020-04-24.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము  (1949)  రచించినవారు కందుకూరి వీరేశలింగం పంతులు
  3. "పద్యాన్ని ఎత్తి నిలబెట్టిన సాహిత్య మాగాణం | Telangana Magazine". magazine.telangana.gov.in. Retrieved 2020-04-24.
  4. "ఆంధ్రకవితరంగిణి" లోనున్నది. (నాల్గవ సంపుటము. పుట 152)

బాహ్య లంకెలు

మార్చు
 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: