కోటగిరి సీతారామ స్వామి
కోటగిరి సీతారామ స్వామి ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు తొలిసారిగా 1955 లో జరిగిన ఆంధ్రరాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బొబ్బిలి శాసనసభ నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యుడు. అతను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు.
జీవిత విశేషాలు
మార్చుఅతను 1904లో పూర్వపు శ్రీకాకుళం జిల్లాకు చెందిన బొబ్బిలి లో జన్మించాడు. స్కూలు ఫైనలు వరకు విద్యనభ్యసించాడు. 1982లో రాజకీయ ప్రవేశం చేసిన వెంటనే జైలుశిక్ష అనుభవించాడు. 1938-42 మధ్య కాలంలో విశాఖపట్టణం జిల్లా బోర్డు ఉపాధ్యక్షునిగా, 1950-53 కాలంలో శ్రీకాకుళం జిల్లా బోర్డు ఉపాద్యక్షునిగా, శ్రీకాకుళం జిల్లా సంఘ సభ్యునిగా, శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా, విజయనగరం సెంట్రల్ బ్యాంకు ఉపాద్యక్షునిగా పనిచేసాడు. అతనికి సహకారోద్యమం పై ప్రెత్యేక అభిమానం. [1]
1955 ఎన్నికలు
మార్చుఆంధ్ర రాష్ట్ర శాసనసభకు తొలిసారిగా 1955 లో జరిగిన ఆంధ్రరాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బొబ్బిలి శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప పి.ఎస్.పి అభ్యర్థి పై విజయం సాధించాడు. ఈ ఎన్నికలలో అతనికి 14031 ఓట్లు రాగా, ప్రత్యర్థికి 1367 ఓట్లు వచ్చాయి.[2]
మూలాలు
మార్చు- ↑ ఆంధ్ర శాసనసభ్యులు. 1955.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1955". Elections in India. Retrieved 2023-07-16.